
సాక్షి, నెల్లూరు: డీఆర్‌డీఓ చైర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. నెల్లూరులోని స్వగృహంలో నివసిస్తున్న సతీష్ రెడ్డి తల్లి గుండ్రా రంగమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థత చెందిన ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. రంగమ్మ భౌతికకాయాన్ని ఆమె స్వస్థలమైన ఆత్మకూరు మండలం మహిమలూరుకు నేడు సాయంత్రం తరలించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన సతీష్‌రెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయలు దేరారు. రేపు ఉదయం 9 గంటలకు రంగమ్మ అంత్యక్రియలు చేపట్టనున్నారు.