సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలను హ్యాకింగ్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి తెలిపారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డీ కోడ్ చేయడం కష్టతరమని సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈవీఎం మిషన్లలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్‌స్ట్రాల్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో పరిశీలించిన తర్వాతే ఈవీఎంలను వినియోగిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
సందీప్ రెడ్డి మాట్లాడుతూ... ‘గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నటువంటి కీలక పెద్దలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అభద్రతా భావంతో దుష్ప్రచారం చేస్తున్నారు. తాను ఒక ఎంబేడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్‌క్రిప్టింగ్ మీద గత 15 సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్న వ్యక్తిగా వాస్తవాలను యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దల ఆరోపణలు చేస్తున్నట్లు ఒక ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్‌వర్క్ వీడియోస్‌తో బిల్డ్ చేయాలంటే చాలా ఖరీదయిన పని’ అని అన్నారు.
పూర్తి వీడియో...
Comments
Please login to add a commentAdd a comment