సాక్షి, వనపర్తి : దేశంలో 1952 నుంచి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చింది. మొదట్లో బ్యాలెట్ పేపర్లు, సిరా, స్వస్తిక్ గుర్తు తదితర సామాగ్రిని ఎన్నికల కోసం ఉపయోగించేవారు. మూడు దశాబ్దాల ఈ పద్ధతినే అవలంభించిన అధికారులు 36 ఏళ్ల క్రితం ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)లను వాడుకలోకి తీసుకువచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారిగా ఈవీఎంలను దేశంలోనే.. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే 1982–83లో పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. కొన్ని కారణాలతో 1984లో సుప్రీం కోర్టు ఈవీఎంలను ఉపయోగించరాదని ఆదేశించింది. అనంతరం ప్రభు త్వం చేసిన సవరణలతో సుప్రీం కోర్టు ఈవీఎంల వాడకాన్ని సమర్దిం చింది.
1990లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక నిఫుణుల సూ చన మేరకు ఈ కమిటీ ఈవీఎంల వాడకాన్ని సిఫారసు చేసింది. ఇక 1998లో ఈవీఎం వాడకానికి ప్రజామోదం లభించింది. 1999 తర్వాత పలు రాష్ట్రా ల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఈవీఎం లు ఉపయోగించారు. గడిచిన మూడు లోక్‌సభ ఎన్నికలను పూర్తిగా ఈవీఎంలతోనే నిర్వహించారు. కాలానుగుణంగా ఈవీ ఎంల్లో మార్పులు తీసుకొస్తున్న అధికారులు ఈసారి వీటికి వీవీ ప్యాట్‌లను జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment