balletpaper
-
అమెరికా బ్యాలెట్ పేపర్‌పై తెలుగు
వాషింగ్టన్: తెలుగు వారందరూ గర్వించదగ్గ ఒక అద్భుతమైన విషయం అమెరికా ఎన్నికల వేళ చోటు చేసుకుంది. నవంబర్ 3వతేదీ నుంచి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాషలో కూడా రాయనున్నారు. తెలుగును అమెరికాలో అధికార భాషగా గుర్తించడంతో ఎన్నికల వేళ తెలుగు అక్షరాలు కూడా బ్యాలెట్‌పై కనిపించనున్నాయి. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుగులో వివరిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగును మాట్లాడుతున్నారు. వీరిలో 9 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నారు. అమెరికాలో తెలుగువారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్ -
ఆర్టీసీ ఉద్యోగులపై చిన్నచూపు
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ కార్మికులు ఈ దేశ పౌరులు కాదా అని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు ఓటుహక్కును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇతర ఉద్యోగుల మాదిరిగా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడానికి అధికారులకు వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల విధులకు 480 మంది ఉద్యోగులు పశ్చిమ రీజియన్ పరిధిలో ఎన్నికల విధులు సంబంధించి ఈవీఎంలు, వీవీ పాట్లు, ప్రొసీడింగ్ అధికారులు, ఏపీఓలు తదితర సిబ్బందిని తరలించడానికి 400 బస్సులను రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు 400 ఆర్టీసీ బస్సులకు 400 మంది డ్రైవర్లు, ప్రతి 5 బస్సులకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున మొత్తం మీద 480 మందిని ఆర్టీసీ అధికారులు నియమించారు. ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు బుధవారం సాయంత్రం నుంచే తరలివెళ్లిపోవడంతో వారివారి సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే హక్కును కోల్పోతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర శాఖల ఉద్యోగులకు అధికారులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించగా ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఆ అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటు హక్కు కోల్పోతున్న మరో 100 మంది కార్మికులు ఇదిలా ఉండగా కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న కార్మికులే కాక మరో 100 మంది కార్మికులు కూడా ఓటుహక్కును కోల్పోతున్నారు. ప్రతి నిత్యం జిల్లా నుంచి 32 బస్సులు హైదరాబాద్‌కు మరో 18 వరకూ బస్సులు విశాఖపట్నం, తిరుపతి, సింధనూరు, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు బస్సులు నడిపే డ్రైవర్లు, వారి సహాయకులు వారివారి విధుల్లో ఉండడం వల్ల వారు కూడా ఓటు హక్కుకు దూరమవుతున్నారు. ఇటువంటి విధుల్లో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించకపోవడంతో వారు తమ ప్రాథమిక హక్కును కోల్పోతున్నారు. అధికారుల వింత వాదన కాగా ఓటు హక్కు వినియోగంపై ఆర్టీసీ అధికారులు చెబుతున్న వినిపిస్తున్న వాదనలు వింతగా ఉన్నాయని ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఏదో ఒక ఖాళీ సమయంలో తమ ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణాత్మకంగా లేవంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు బస్సులను అక్కడే ఒదిలేసి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్లడం సాధ్యపడదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా బస్సులపై ప్రతాపం చూపే అవకాశం ఉంటుందని, అటువంటి సమయంలో సంబంధిత డ్రైవర్ బస్సు వద్ద లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అటువంటివి జరిగితే దానికి సంబంధిత డ్రైవరే బాధ్యత వహించాల్సి ఉన్నందున వారు బస్సును విడిచి వారికి ఓటు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చే వెసులుబాటు ఉండదంటున్నారు. ఉద్ధేశపూర్వకంగానే ప్రభుత్వ చర్య ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చూసిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎక్కువమంది ఉద్యోగులు ఓటు వేసినట్లు అందిన ఇంటిలిజెన్స్ నివేదికల మేరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఓటు హక్కును దూరం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి చర్య తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులు కూడా వైసీపీకే ఓటు వేసే అవకాశం ఉన్నందున వారికి ఓటు హక్కును దూరం చేయడానికే కుట్రపన్నిందంటున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం 2,242 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో ఉంటారు. వారిలో చాలా మంది ఎన్నికల సమయంలో విధుల్లో ఉండే అవకాశం ఉన్నందున వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దేశంలోని ప్రతి పౌరుడుకి ప్రాథమిక హక్కైన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఇతర శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించి ఆర్టీసీ కార్మికులకు ఈ సౌకర్యం కల్పించకపోవడం వివక్షాపూరితంగా పరిగణించాలి. దీనిపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి. – ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు, ఎన్ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్ -
నిజామాబాద్‌లో.. పేపర్ బ్యాలెట్‌తోనే నిర్వహించాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో నగరశివారులోని విజయలక్ష్మి ఫంక్షన్హాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పించే కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అభ్యర్థులైన రైతులు మాట్లాడుతూ తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, కుట్రలు జరిగే అవకాశముందని ఆరోపించారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుందన్నా రు. ఏర్పాట్లు చేసేందుకు సమయం లేకుంటే ఎన్నికలను వాయిదా వేయాల ని డిమాండ్ చేశారు. అంతేగాకుండా బరిలో నిలిచిన రైతు అభ్యర్థులు కొంత మందికి ఇంకా అధికారికంగా గుర్తు కేటాయించలేదని, తాము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. రైతులంటే అధికారులు, ప్రభుత్వానికి చులకనగా ఉందని ఆరోపించారు. ఉదయం 11 గంటలకు ఈవీఎంలపై అవగాహన కేంద్రానికి చేరుకోవాలని నోటీసులిచ్చి.. తీరా సాయంత్రం 5 గంటలకు రావాలని సూచించడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా రైతు అభ్యర్థులను చుల కనగా చూస్తున్నారని ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. సీపీ కార్తికేయ జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో అధికార యంత్రాం గం పనిచేస్తుందని, సంయమనం పాటించి సహకరించాలని కోరారు. దీంతో వారు ఆందోళన విరమించి కేం ద్రంలోకి వెళ్లారు. అనంతరం సాయం త్రం మరోమారు ఆందోళన చేశారు. ఎంపీ అభ్యర్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఈవీఎంలపై అవగాహన కల్పించడంలో ఆలస్యం, తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం తనిఖీ కేంద్రం పరిశీలన.. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ ఈవీఎం తనిఖీ నిర్వహిస్తున్న కేంద్రం, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏర్పాట్లపై అన్ని విషయాలను వివరించారు. ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈవీఎం చెకింగ్‌ల ప్రక్రియ, ఏర్పాట్లను తెలియజేశారు. ఎం–3 ఈవీఎంలపై ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కాగా బుధవారం రాత్రి 7.30 తర్వాత ఎం–3 ఈవీఎంలు సుమారు 15 ట్రక్కుల్లో జిల్లాకు చేరుకున్నాయి. -
బ్యాలెట్ టు ఈవీఎం
సాక్షి, వనపర్తి : దేశంలో 1952 నుంచి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చింది. మొదట్లో బ్యాలెట్ పేపర్లు, సిరా, స్వస్తిక్ గుర్తు తదితర సామాగ్రిని ఎన్నికల కోసం ఉపయోగించేవారు. మూడు దశాబ్దాల ఈ పద్ధతినే అవలంభించిన అధికారులు 36 ఏళ్ల క్రితం ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం)లను వాడుకలోకి తీసుకువచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారిగా ఈవీఎంలను దేశంలోనే.. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్రంలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే 1982–83లో పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించారు. కొన్ని కారణాలతో 1984లో సుప్రీం కోర్టు ఈవీఎంలను ఉపయోగించరాదని ఆదేశించింది. అనంతరం ప్రభు త్వం చేసిన సవరణలతో సుప్రీం కోర్టు ఈవీఎంల వాడకాన్ని సమర్దిం చింది. 1990లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక నిఫుణుల సూ చన మేరకు ఈ కమిటీ ఈవీఎంల వాడకాన్ని సిఫారసు చేసింది. ఇక 1998లో ఈవీఎం వాడకానికి ప్రజామోదం లభించింది. 1999 తర్వాత పలు రాష్ట్రా ల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఈవీఎం లు ఉపయోగించారు. గడిచిన మూడు లోక్‌సభ ఎన్నికలను పూర్తిగా ఈవీఎంలతోనే నిర్వహించారు. కాలానుగుణంగా ఈవీ ఎంల్లో మార్పులు తీసుకొస్తున్న అధికారులు ఈసారి వీటికి వీవీ ప్యాట్లను జత చేశారు. -
శిష్యునిపై గురువు సీరియస్..
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే తప్పుబట్టారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని ఎన్నికల సంఘాన్ని కేజ్రీవాల్ కోరడంపై హజారే తీవ్రంగా స్పందించారు. ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకు వెళ్తుంటే.. ఇంకా స్కూల్ బ్యాలెట్ పేపర్ పద్ధతిని వాడాలని సూచించడం సరికాదని కేజ్రీవాల్‌ను మందలించారు. 2011 హజారే సారథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ ఆయన శిష్యుడిగా కీలకపాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి నిరోధక చట్టం తీసుకురావాలని విద్యార్థులు, యువతతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను హజారే వ్యతిరేకించారు. కానీ ఢిల్లీ సీఎం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ కాంగ్రెస్‌కు మేలు.. పంజాబ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరగడంతో కాంగ్రెస్ కు మేలు జరిగిందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర ఓట్లు ట్యాంపరింగ్‌తో బీజేపీ-అకాలీదళ్‌కు వెళ్లాయని ఆరోపించారు. దీంతో ఆప్‌కు తక్కువ సీట్లు వచ్చాయని, కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుందని తెలిపారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, ఆప్‌లు సమానంగా సీట్లు గెలుచుకుంటాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా కేజ్రీవాల్ ఆరోపణల పై బీజేపీ నాయకులు ఆయనకు మతిభ్రమించిందని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.