వాషింగ్టన్: తెలుగు వారందరూ గర్వించదగ్గ ఒక అద్భుతమైన విషయం అమెరికా ఎన్నికల వేళ చోటు చేసుకుంది. నవంబర్ 3వతేదీ నుంచి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బ్యాలెట్ పేపర్‌పై తెలుగు భాషలో కూడా రాయనున్నారు. తెలుగును అమెరికాలో అధికార భాషగా గుర్తించడంతో ఎన్నికల వేళ తెలుగు అక్షరాలు కూడా బ్యాలెట్‌పై కనిపించనున్నాయి. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుగులో వివరిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగును మాట్లాడుతున్నారు. వీరిలో 9 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నారు. అమెరికాలో తెలుగువారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో తెలుగును అధికారిక భాషగా గుర్తించారు.
చదవండి: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్
Comments
Please login to add a commentAdd a comment