
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంల సెక్యూరిటీని నిరూపించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 1982 నుంచే ఈవీఎంలను వాడుతున్నామన్నారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోణల గురించి కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల పట్ల తానేమీ స్పందించనన్నారు రజత్ కుమార్. ప్రస్తుతం తాము పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఓటర్ల కోసం 1950 హెల్ప్‌లైన్‌ను లాంచ్ చేశామని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి అనుమానాలున్న 1950కి కాల్ చేయవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాపై కూడా ఆంక్షలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఇప్పటికే సోషల్ మీడియా హెడ్స్‌తో మాట్లాడినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment