సాక్షి, భువనగిరి : ముందస్తు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో గందరగోళానికి ఎన్నికల సంఘం చెక్‌పెట్టింది. ఈవీఎంలలో అభ్యర్థి ఫొటో చూసి ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు గుర్తుతో పాటు 25 సెంటీమీటర్ల పొడవుతో ఫొటో ఉంటుంది. అభ్యర్థి 3 నెలల క్రితం దిగిన తాజా ఫొటోను బ్యాలెట్ పత్రాల్లో ముద్రించనున్నారు. నోటా వద్ద మాత్రం క్రాస్ గుర్తు ఉంటుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో నోటా ఉన్నా దానికి ప్రత్యేకంగా గుర్తు కేటాయించలేదు. గతంలో స్వతంత్రులుగా బరిలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఒకే గుర్తు కేటాయించడంతో కొందరు ఓటర్లు తికమక పడి ఎంపీ ఓటు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఓటు ఎంపీకి వేయడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు పోటీ చేసే అభ్యర్థులు తాజా స్టాంప్ సైజు కలర్ ఫొటోను నామినేషన్ వేసే స మయంలో రిటర్నింగ్ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment