NOTA option
-
TS Election 2023: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. 'నోటా' కు ఎక్కువ ఓట్లు వస్తే..!?
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. మరి తమ నియోజకవర్గ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే ఏం చేయాలి. ఎవరికో ఒకరి ఓటు వేయకుండా తమ నిరసనను వ్యక్తం చేయడం ఎలా..? దీనిపై 2003వ సంవత్సరంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అనేక వాదోపవాదనలు జరిగిన తరువాత ‘నోటా’ (నన్ ఆఫ్ ద ఎబౌ)ను ఈవీఎంలలో చేర్చాలని సుప్రీం సూచించింది. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం ఈవీఎంలలో ‘నోటా’ను చేర్చింది. బరిలో ఉన్న వారెవ్వరూ నచ్చకపోతే నోటా మీట నొక్కవచ్చు. అయితే జిల్లాలో జరిగిన రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఎన్నికలో నోటాకు 1 శాతానికి మించి ఓట్లు పడకపోవడం గమనార్హం. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. 2014 నుంచి అమల్లోకి వచ్చిన నోటాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కేవలం 0.2 నుంచి 0.4 శాతమే. 2018 ఎన్నికల్లో 0.5 నుంచి 0.8 శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే దాని తర్వాత స్థానంలో నిలిచిన వారు గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెపుతున్నాయి. ఇతర దేశాల్లో ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి. ► బెల్జియం, ప్రాన్స్, యూఎస్ఏలో ఈవీఎంల మీద నోటాను అమలు చేస్తున్నారు. ► కొలంబియా, స్పెయిన్, బ్రెజిల్, గీస్, పిన్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, చీలి వంటి దేశాలు ఓట్ ఆఫ్ రిజెక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ► మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 2008 నుంచి నోటాను అమలు చేస్తుండగా పాకిస్తాన్ 2013 నుంచి నోటాను అమలు చేస్తోంది. -
నోటాకే ఓటన్న లఖీంపూర్ రైతులు
లఖీంపూర్‌ఖేరీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటేస్తామని లఖీంపూర్ ఖేరీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు తమను మోసం చేశాయని, ఇతర పార్టీలు నిష్ఫలమైనవని రైతులు వాపోయారు. రైతు చట్టాలు తదుపరి హింసకు బీజేపీ కారణమని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగని తమకు గతంలో రుణమాఫీ చేసిన సమాజ్‌వాదీని కూడా ఆదరించాలనుకోవడం లేదు. తమ ఫిర్యాదుల పరిష్కారానికి ఏ పార్టీ నిజాయితీగా యత్నించలేదని, అందువల్ల నోటాకు ఓటేస్తామని పలువురు రైతులు మీడియాకు తెలిపారు. ఎస్పీ హయాంలో బీజేపీ పాలనలో కన్నా దారుణంగా రైతుల పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎస్పీ కూటమి, బీజేపీ ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ తమకు రావాల్సిన పంచదార మిల్లుల బకాయిలు అం దలేదని బాధను వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీలు సానుభూతి మాటలు చెప్పడం మినహా ఏమీ చేయలేదని వాపోయారు. -
గ్రేటర్ ఎన్నికలు; ‘నోటాకే మా ఓటు’
సాక్షి, హైదరాబాద్: సోమవారం కార్తికేయ నగర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. కొనేళ్లుగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడంతో ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో నోటాకే ఓటు వేయాలని కార్తికేయ కాలనీ వాసులు నిర్ణయించుకున్నారు. దీంతో వారు ‘మా ఓటు నోటాకే’ అని బ్యానర్లతో రాజకీయ నాయకులకు స్వాగతం పలికారు. కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని కార్తికేయ కాలని లో 33 ఎకరాల కాలనీ స్థలంలో ప్రజల కోసం ఒక్క ఉద్యానవనం కూడా లేదు. కొంత కాలంగా నీటి పైపులైన్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయనప్పటికీ ఎటువంటి మరమ్మతులకీ నోచుకోలేదు. కాలనీలో కొన్ని రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకున్నవారే లేరు. అందుకే నాయకుల్లో మార్పు కోసమే ఈ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తామని కాలనీవాసులు తెలిపారు. రెండు రోజుల క్రితం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇటువంటి పరిస్థితే ఎదురైన సంగతి తెలిసిందే. యాప్రాల్ (మేడ్చల్ జిల్లా) లోని ప్రకృతి విహార్ లో ప్రచారం కోసం వెళ్లగా అక్కడి ప్రజలు ఓట్లు కోరే ముందు నాయకులు రోడ్లు చూడాలని హనుమంత రావుతో అన్నారు. స్థానికుల వేడిని తట్టుకోలేక డిసెంబర్ 1 తర్వాత రహదారి నిర్మాణాన్ని చేపడుతామని హామి ఇచ్చాకే వారు ఎమ్మెల్యేను ప్రచారానికి వెళ్లనిచ్చారు. -
సరైనోళ్లకే.. లేకపోతే నోటాకే..
సాక్షి, సుజాతనగర్: ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండి, అభివృద్ధికి కృషి చేసేవారికే తమ ఓటు వేస్తామని యువత చెబుతోంది. ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వచ్ఛందం గా వినియోగించుకోవాలని, నోటును కాదు నేతను చూడాలని పేర్కొంటోంది. డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సుస్థిర పాలన అందించే పార్టీకే.. రాష్ట్రంలో సుస్థిర పాలన అందించడమే గాకుండా యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రణాళికాబద్ధంగా పాలించే పార్టీకే ఓటు వేయడానికి ప్రాధాన్యమిస్తాం. అభ్యర్థులందరినీ పరిశీలించి వారిలో మంచి వారిని గుర్తిస్తాను. –వంగవీటి కిరణ్ కుమార్, సుజాతనగర్ విద్యాభివృద్ధిని ఆకాంక్షించేవారికి.. ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండాలి. పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్య నామమాత్రంగా అందుతోంది. విద్యాభివృద్ధికి పాటుపడే వ్యక్తికి నా ఓటు వేస్తా. –చింతలపూడి మాధవి, సుజాతనగర్ అవినీతిని అరికట్టాలి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో అవినీ తి రాజ్యమేలుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సరిగా అంద డం లేదు. పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టే అభ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. అలాంటి అభ్యర్థిని గుర్తించి వారికి నా ఓటు వేస్తాను. –చింతలపూడి సాయి, సుజాతనగర్ స్వార్థపరులకు ఓటు వేయను.. ప్రజలతో ఎన్నికైన వారు సొంత ప్రయోజనాలను పక్కన పెట్టాలి. ప్రజలచేత ఎన్నికైన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మెజారిటీ ప్రజల సమస్యలను నాయకుడు పట్టించుకోవాలి. స్వార్థం లేని నాయకులను గుర్తించి వారికే నా ఓటు వేస్తాను. –చిన్నంశెట్టి మహిజ, సుజాతనగర్ గ్రామ సమస్యలను పరిష్కరించాలి ఎన్నికైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి. పదవి ఉందని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా సొంత ప్రయోజనాలకు వాడకూడదు. గ్రామా ల్లోని సమస్యలను నిరంతరం గుర్తించి వాటికి పరిష్కారం చూపాలి. అభివృద్ధే చేసే నాయకుడికే నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాను. –దొడ్డి ఉపేందర్, సీతంపేట -
వారి మాట ‘నోటా’..
సాక్షి, కల్వకుర్తి టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. అలాంటి ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ అవగాహన కల్పిస్తోంది. అయితే, ఓటు వేయాలనే భావన ఉన్నా అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఎలా అనే పరిస్థితి తలెత్తేది. కానీ కొన్నేళ్ల క్రితం ఎన్నికల కమిషన్ ఈవీఎంల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్‌కు కూడా ప్రవేశపెట్టింది. దీంతో అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తున్నారు. ఈ సందర్భంగా నోటాకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13,702 ఓట్లు పోలయ్యాయి. నోటాకు పోలైన ఓట్లలో 36 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా ఉండడం గమనార్హం. జడ్చర్లలో అత్యధికం ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో 14 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా జడ్చర్ల నియోజకవర్గంలో 1,537 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇందులో 5 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక అత్యల్పంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 581 ఓట్లు పోటాకు పోలయ్యాయి. కాగా, పలు నియోజకవర్గాలలో నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. గత ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గంలో 14 మంది పోటీ చేయగా అందులో ఎనిమిది మందికి నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఒక అభ్యర్ధికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. కాగా, నోటాకు పోలయ్యే ఓట్ల సంఖ్య రానురాను పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 2014 లో నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లు, పోలైన ఓట్లు, నోటాకు నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. - జడ్చర్ల నియోజకవర్గంలో 1,91,077 మంది ఓటర్లకు 1,46,551 ఓట్లు పోలయ్యాయి. ఇక 1,537 ఓట్లు నోటాకు, ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడు మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. - నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 2,04,630 మంది ఓటర్లు ఉండగా 1,51,180 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 581 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పద్నాలుగు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఏడుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. - కొల్లాపూర్ నియోజకవర్గంలో 2,08,312 మంది ఓటర్లు ఉండగా 1,55,532 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 767 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదు కావడం గమనార్హం. - వనపర్తి నియోజకవర్గంలో 2,36,908 మంది ఓటర్లు ఉండగా 1,68,370 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 860 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఆరుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 2,19,880 మంది ఓటర్లకు గాను 1,48,662 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 607 ఓట్లు నోటాకు, 11 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్ధులు పోటీ చేయగా ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - దేవరకద్ర నియోజకవర్గంలో 2,08,413 మంది ఓటర్లకు 1,50,093 ఓట్లు పోలయ్యాయి. కాగా, పోలైన ఓట్లలో 1,213 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉండగా.. ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - అలంపూర్ నియోజకవర్గంలో 2,10,104 మంది ఓటర్లు ఉండగా 1,59,348 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 965 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న 11 మంది అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - గద్వాల నియోజకవర్గంలో 2,12,787 మంది ఓటర్లకు 1,72,603 ఓట్లు పోలయ్యాయి. ఇక పోలైన ఓట్లలో 862 ఓట్లు నోటాకు, ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గానికి పదమూడు మంది అభ్యర్ధులు పోటీచేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. - మక్తల్ నియోజకవర్గంలో 2,09,537 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా 1,41,756 ఓట్లు పోల్ కాగా, 724 ఓట్లు నోటాకు, నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి పద్నాలుగు మంది బరిలో ఉండగా ఇద్దరు అభ్యర్ధులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - నారాయణపేట నియోజకవర్గంలో 1,99,018 మంది ఓటర్లకు గాను 1,36,831 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,131 ఓట్లు నోటాకు, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా నోటాకు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది అభ్యర్ధులు పోటీచేయగా ఇద్దరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. - కొడంగల్ నియోజకవర్గంలో 1,97,649 మంది ఓటర్లు ఉండగా 1,39,072 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1,136 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురు అభ్యర్ధులు పోటీచేయగా శ్రీనివాస్ రెడ్డికి 680 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆయనకు నోటాకు తక్కువగా ఓట్లు వచ్చి నట్లయింది. - కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,62,317 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1,140 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలైంది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో పది మంది అభ్యర్ధులు ఉండగా.. ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు నమోదయ్యాయి. - అచ్చంపేట నియోజకవర్గంలో 2,04,850 మంది ఓటర్లు ఉండగా 1,47,768 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 1,298 ఓట్లు నోటాకు, ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు కూడా నోటాకు పోలయింది. ఈ నియోజకవర్గానికి ఏడుగురు అభ్యర్ధులు పోటీ చేయగా ఇద్దరు అభ్యర్ధులకు నోటాకంటే తక్కువ ఓట్లు రాగా,123 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. -
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు..!
సాక్షి, భువనగిరి : ముందస్తు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో గందరగోళానికి ఎన్నికల సంఘం చెక్‌పెట్టింది. ఈవీఎంలలో అభ్యర్థి ఫొటో చూసి ఓటు వేసే అవకాశం కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థి పేరు గుర్తుతో పాటు 25 సెంటీమీటర్ల పొడవుతో ఫొటో ఉంటుంది. అభ్యర్థి 3 నెలల క్రితం దిగిన తాజా ఫొటోను బ్యాలెట్ పత్రాల్లో ముద్రించనున్నారు. నోటా వద్ద మాత్రం క్రాస్ గుర్తు ఉంటుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో నోటా ఉన్నా దానికి ప్రత్యేకంగా గుర్తు కేటాయించలేదు. గతంలో స్వతంత్రులుగా బరిలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఒకే గుర్తు కేటాయించడంతో కొందరు ఓటర్లు తికమక పడి ఎంపీ ఓటు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఓటు ఎంపీకి వేయడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు పోటీ చేసే అభ్యర్థులు తాజా స్టాంప్ సైజు కలర్ ఫొటోను నామినేషన్ వేసే స మయంలో రిటర్నింగ్ అధికారికి ఇవ్వవలసి ఉంటుంది. -
సర్పంచ్ ఎన్నికలు: బ్యాలెట్ పేపర్‌పై మరో గుర్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూలైలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా నోటా (పై వారెవరూ కాదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంతవరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనే నోటా ఆప్షన్ ఉందని, తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఆప్షన్‌ను ప్రవేశ పెడుతున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ చివరన ‘నోటా’ గుర్తు ఉంటుందని, పైన పేర్కొన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేని వారు నోటాను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు. నోటా వల్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఏమేరకు అసంతృప్తి ఉందో బయటపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1 నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తి ఎన్నికలు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో నోటాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జూలై నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణల కారణంగా 30 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ఇతర రాష్రాల నుంచి కూడా బలగాలను తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. ఎన్నికలు ముగిసే వరకూ రాష్ట్రంలో కొత్తగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన పంచాయతీ సీట్లను కేటాయించడానికి జూన్ 1నాటికి బీసీ ఓటర్ల గణన పూర్తవుతుందని నాగిరెడ్డి తెలిపారు. -
కాకినాడ ఎన్నికల్లో కనిపించని ‘నోటా’
-
కాకినాడ ఎన్నికల్లో కనిపించని ‘నోటా’
కాకినాడ : నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాకినాడ ఏటిమొగ్గలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. 14వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రాలలో ప్రచారం చేస్తుండగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఇప్పటివరకూ 12 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు ఎన్నికల ఈవీఎంలపై నోటా ఆప్షన్ కనబడలేదు. మరోవైపు పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన అనధికార వ్యక్తులు, ఓటు లేని వారు సైతం పోలింగ్ బూత్ లోపలికి వెళ్లడం వివాదాస్పదమౌతుంది. వారిని పోలీసులు అదుపు చేయలేకపోవడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
'గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ....గ్రేటర్ ఎన్నికల బరిలో మొత్తం 1333 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని... ఇప్పటి వరకు 13.87 లక్షల మంది ఓటర్లు స్లిప్పులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అత్యధికంగా జంగంమెట్ డివిజన్ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా 8 డివిజన్ల నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు జనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్) ఆప్షన్ ఎన్నుకునే విధానాన్ని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను అమలులోకి తెచ్చారు.