
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా, ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారుల తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది.
185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బూత్‌లో 12 ఈవీఎంలను వినియోగించారు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. నిజామాబాద్‌లో 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment