
సాక్షి, విజయవాడ : ఈవీఎంలు మొరాయించడం వల్ల విజయవాడలోని పలు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పలు చోట్ల ఓటర్లు పోలింగ్ లైన్‌లలో బారులు తీశారు. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినదానికి, చేసేదానికి సంబంధం లేదంటూ ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. బూత్‌లకి ఓటర్ స్లిప్పులను ఇవ్వడానికి కూడా అధికారులు రాలేదు. నగర వ్యాప్తంగా పోలీసు కొరత కూడా ఉంది. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు. ఏ బూత్‌లో ఓటు వేయాలో చెప్పడానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం.