
సాక్షి, విజయవాడ: టీడీపీ పార్టీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, జీవీఎల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో అభ్రతభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమ సొంత ప్రయోజనాల కోసమే రక్షించమని టీడీపీ కోరుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకున్న పాపనపోలేదు. ఏపీలో నిజమైన ప్రతిపక్ష పాత్ర మేమే పోషించబోతున్నాము. ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సైతం.. టీడీపీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా క్షీణించింది అంటున్నారు. ఎన్నికల్లో టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేశారంటే వారిపై ఎంత స్థాయిలో అసంతృప్తి ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ ప్రజలు మళ్లీ పాత కుంపటిలోనే పడాలని కోరుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment