
సాక్షి, ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, ఎంపీ జీవీఎల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ హయంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో గత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు కూడా జీవీఎల్ నరసింహరావు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేశారో చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment