సాక్షి, విశాఖపట్నం: పోలవరం నిర్మిస్తామని కేంద్రం చెబితే.. మేమే నిర్మిస్తామని చంద్రబాబు తీసుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమన్నారు.
పోలవరం పేరుతో టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. పోలవరంలో కమీషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పోలవరంలో అవినీతి జరిగిందని మాట్లాడిన విషయాన్ని జీవీఎల్ మరోసారి ప్రస్తావించారు.
మళ్లీ చంద్రబాబు వస్తే పోలవరం పూర్తి చేస్తానంటూ మాట్లాడుతున్నారని, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తాను పుట్టిన రాయలసీమకు, సొంత జిల్లా చిత్తూరుకు ఎటువంటి మేలు చేయలేదన్న జీవీఎల్.. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం చేయబడ్డాయని జీవీఎల్ తెలిపారు. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు జీవీఎల్.
చంద్రబాబు ఓవరాక్షన్
కాగా, ఏలూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. రోడ్డుపై బైఠాయించి తననే అడ్డుకుంటారా అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగలడంతో కొత్త నాటకాన్ని ప్లే చేయబోయారు. పోలవరాన్ని పరిశీలిస్తానంటూ బాబు హడావిడి చేశారు. పోలవరానికి వెళ్లేదారిలో బైఠాయించి పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు చంద్రబాబు.యాత్రలో అడుగడుగునా నిరసన సెగలు తగలడం వల్లే కొత్త నాటకాన్ని రక్తికట్టించే యత్నం చేశారు చంద్రబాబు.
చదవండి: బాబోయ్.. ఇదేం ఖర్మరా!.. బాబు డొల్ల మాటలు.. ఇవీ వాస్తవాలు
Comments
Please login to add a commentAdd a comment