పాకిస్తాన్‌పై భారత్ చర్యలను తప్పుబడుతూ చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జీవీఎల్ అన్నారు. చంద్రబాబుకు దేశమంతా చివాట్లు పెట్టిందని చెప్పారు. దాంతో ‘యూటర్న్ బాబు’గా పేరొందిన చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. జనసేన అధినేత పవన కల్యాణ్ (పీకే) కూడా ఈ మధ్య పాకిస్తాన్‌పై ప్రతీకారం విషయంలో వింతగా మట్లాడుతున్నారని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.