
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు(పాత చిత్రం)
ఢిల్లీ: టీడీపీకి ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదని చెప్పారు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు. చట్టప్రకారమే టీడీపీ రాజ్యసభపక్షం విలీనం అయ్యిందని వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్లు కోసం వస్తోన్న వారిపై నిఘా ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రులు చేసిన టీడీపీకి మా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment