
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. సహాయ పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్)లో భారీగా ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు, ట్యూబువెల్స్ పేరుతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలపై విచారణ జరుపుతున్నారా అని రాజ్యసభలో ప్రశ్నించినట్లు తెలిపారు. అదే విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment