r and r package
-
సీఎం వైఎస్ జగన్ ఔదార్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు (మెట్రో): ఎన్నో సెక్యూరిటీ ఆంక్షలు.. పూర్తి స్థాయి బందోబస్తు.. ఎటూ చూసినా పోలీసుల నిఘా కన్ను.. ఇంతటి భద్రతా వలయం మధ్య ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం రోడ్డు పక్కన ఓ కుటుంబం కాగితం పట్టుకుని నిలుచుంది. వారు సీఎం కంట పడాలని ప్రయత్నిస్తుంటే భద్రతా విభాగం సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని కాన్వాయ్‌లో వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ గమనించి.. కాన్వాయ్‌ని ఆపించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కాస్త ముందుకెళ్లి ఆగింది. (చదవండి :గోరుముద్ద నాణ్యతకు ప్రత్యేక యాప్) వెంటనే కారు దిగి ఆ పేపర్ పట్టుకున్న వాళ్లను తన వద్దకు పంపాలంటూ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘సార్.. మాతో పాటు మా ఊళ్లో మరికొన్ని కుటుంబాలు స్థానికంగా నివాసం ఉంటున్నా, అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయలేదు. మాకు మాత్రమే ఇచ్చినందున మేము తీసుకోలేదు. అందరికీ ఈ ప్యాకేజీ ఇచ్చేలా చూడండి. ఇటీవల వరద సమయంలో కూడా మా కుటుంబాలకు రూ.5 వేల సాయం అందలేదు’ అని పాతపైడిపాకకు చెందిన బొత్తా త్రిమూర్తులు కుటుంబం సీఎంకు విన్నవించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజును ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని వారికి హామీ ఇచ్చారు. -
‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరానికి సంబంధించిన అన్ని పనులపై పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులకు అందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మీద చర్చించారు. ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగానే కొనసాగుతోందని, సవరించిన అంచనాల ప్రకారం దీని కోసం 32 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే మరిన్ని అభ్యర్థనలు బట్టి ప్యాకేజీ విషయంలో చర్చిస్తామని తెలియజేశారు. పోలవరం వరద ముంపుపై చర్చ జరుగుతోందని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస బాధితులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఆర్ అండ్ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. సహాయ పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్)లో భారీగా ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు, ట్యూబువెల్స్ పేరుతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలపై విచారణ జరుపుతున్నారా అని రాజ్యసభలో ప్రశ్నించినట్లు తెలిపారు. అదే విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరతానని పేర్కొన్నారు. -
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భారీ కుంభకోణం
-
నిర్వాసితులకు మస్కా
వేలేరుపాడు: పోలవరం భూసేకరణలో భాగంగా ఎసైన్మెంట్ భూములకు పరిహారం అందించే విషయంలో అనేక మంది నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగింది. అధికారులు ఎంజాయిమెంట్ సర్వే అనంతరం నోటీసు బోర్డులో పేర్లు ప్రకటించి, అవార్డు కూడా పాస్ చేశారు. అవార్డులో విస్తీర్ణం, పరిహారం ఎంత అన్నది స్పష్టంగా ఉన్నప్పటికీ, తుది జాబితాలో మాత్రం పరిహారం ఎంతో తేల్చలేదు. ఫలితంగా నిర్వాసితులకు భూ నష్ట పరిహారం నేటికీ అందలేదు. ఈ తప్పిదం ఎక్కడ జరిగిందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 18,730 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 16,025 ఎకరాలు సేకరించారు. ఇందులో 14,000 ఎకరాల పట్టా భూమి ఉండగా, 2025 ఎకరాల అసైన్ భూమి ఉంది. ఈ రెండు మండలాల్లో మొత్తం 7,300 మంది రైతులకు ఇప్పటివరకు రూ.1270 కోట్ల పరిహారం అందించారు. అయితే వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలో ఎసైన్మెంట్ భూములకు పరిహారం పంపిణీ గందరగోళంగా ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటూ సాగుదారులుగా కొనసాగుతున్న 28 మంది నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించకుండా మొత్తం 56 ఎకరాల భూమికి ఏకంగా నిండు సున్నాగా ప్రకటించడం వింతగా ఉంది. సున్నా జాబితాలో ఎంతో మంది నిర్వాసితులు అధికారులు ప్రకటించిన పరిహారం బిల్లులో మాత్రం సున్నాగా వచ్చిన నిర్వాసితులు అనేక మంది ఉన్నారు. పూచిరాల గ్రామానికి చెందిన సోడే చెల్లెమ్మకు 301, 218, 370 సర్వే నంబర్లలో 2.28 ఎకరాల భూమికి గాను రూ.28,35,000 పరిహారంగా ప్రకటించారు. 329, 330 సర్వే నంబర్లలో పిట్టా రమేష్‌కు 5.28 ఎకరాలుండగా రూ.59,85000, 329, 218‡ సర్వే నంబర్లలో పిట్టా మారయ్య పేర 4.19 ఎకరాలుండగా రూ.49,35,000, 329, 218 సర్వే నంబర్లలో పిట్టా రాములు పేర ఉన్న 4.25 ఎకరాలకు రూ.48,30,000, 330 సర్వే నంబర్లో పిట్టా ముత్తమ్మ, రాములమ్మ పేర ఉన్న 3.16 ఎకరాలకు రూ.35,75,000, ఇంకా 192 సర్వే నంబర్లో గారా హనుమంతురావు, కుచ్చర్లపాటి జయరావు, కుచ్చర్లపాటి సత్యనారాయణలకు ఇలా పరిహారం ప్రకటించి బిల్లులో అంతా మాయ చేశారనే ఆరోపణలు నిర్వాసిత రైతుల నుంచి విన్పిస్తున్నాయి. భూమి లాక్కుని రూపాయీ ఇవ్వలే ఈ గిరిజనుడి పేరు బీరబోయిన దేశయ్య. పూచిరాల గ్రామం. ఇతడికి రేపాకగొమ్ము రెవెన్యూ పరిధిలోని 384, 218 సర్వే నెంబర్లలో 3 ఎకరాల 25 కుంటల భూమి ఉంది. ఈ భూమికి రూ. 38,06,250 పరిహారంగా ప్రకటించారు. తుది జాబితాలో సున్నాగా చూపారు. ఈ గిరిజనుడు ఇప్పటికి ఐదారుసార్లు కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రావడంలేదు. ఈ సున్నాకు అర్థమేమిటో అధికారులకే తెలియాలి. అవార్డులో మూడెకరాల ఆరుకుంటలు ఉంటే.. తుది జాబితాలో సున్నా ఈమె పేరు కమటం చిట్టెమ్మ. నడిమిగొమ్ము గ్రామం. రేపాకగొమ్ము రెవెన్యూలో సర్వే నెంబర్ 165/1 లో ఈమె పేర 3.06 ఎకరాల భూమి ఉంది. గత 32 ఏళ్లుగా ఈ భూమి సాగుచేసుకుంటోంది. ఎంజాయిమెంట్ సర్వే చేసిన అధికారులు నోటీస్‌బోర్డులో పెట్టిన జాబితాలో పేరు ప్రకటించారు. ఈ భూమికి ఏప్రిల్ నెలలో అవార్డు పాస్ చేశారు. అవార్డులో రూ. 33,07,500 పరిహారంగా ప్రకటించారు. తనకు అందరితోపాటు పరిహారం వస్తుందని చిట్టెమ్మ గత నాలుగు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. పరిహారం సొమ్ము తన ఖాతాలో జమ అయ్యిందేమోనని అనేక సార్లు బ్యాంక్ చుట్టూ తిరిగింది. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి వెళితే డబ్బులు ఎకౌంట్లో పడతాయని అధికారులు చెప్పేవారు. కానీ అసలు బిల్లులో మాత్రం సున్నాగా ప్రకటించారు. æచిట్టెమ్మ భర్త శంకరయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి కూరగాయలు అమ్ముకొని జీవిస్తోంది. బిల్లులో తన భూమికి సున్నా ఉందని తెలియడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. అసలు భూమిలేకుండా అవార్డు ఎలా పాస్ చేశారు... ఈమె పేరు కుచ్చర్లపాటి కుమారి. ఎర్రబోరు గ్రామం. ఈమెకు రేపాకగొమ్ము రెవెన్యూలో 192 సర్వే నెంబర్లో 2.05 ఎకరాల భూమి ఉంది. అసలు భూమి లేకుండా అవార్డు పాస్ చేయడం అసాధ్యం. గత 20 ఏళ్లుగా ఇదే భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తోంది. రూ. 22,31,250 పరిహారంగా ప్రకటించిన అధికారులు కుమారి భూమికి అవార్డు పాస్ చేశారు. తుది బిల్లులో మాత్రం సున్నాగా పెట్టి ఉంచారు. ఈమెకు నేటి వరకు పరిహారం అందలేదు. ఆమె భర్త రాజారావు ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడు, కుమార్తెలను ఆమె తన రెక్కల కష్టంతో చదివిస్తోంది. -
పట్టిసీమ తరహాలో పరిహారం
కడప సెవెన్‌రోడ్స్ : పట్టిసీమ తరహాలో గండికోట ముంపు వాసులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నింటా అభివృద్ధి చెంది ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్న కోస్తా ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల కింద నష్టపోయిన రైతులకు భారీ ప్యాకేజీ ఇస్తున్న ప్రభుత్వం, వెనకబడ్డ రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శించడం తగదన్నారు. కొత్త భూసేకరణ చట్ట ప్రకారం 2016 సంవత్సరాన్ని కటాఫ్‌గా తీసుకుని పరిహారం ఇవ్వకుండా, గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపడానికి ముంపు వాసులు అడ్డుతగులుతున్నారంటూ నింద మోపడం అన్యాయమన్నారు. ముంపువాసుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య జిల్లా కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి అధ్యక్షతన శనివారం ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1977లో మైలవరం రిజర్వాయర్ ముంపు కింద చౌటుపల్లె వాసులకు ఎకరాకు ఆరు వేల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. ఆ గ్రామం ముంపునకు గురి కాకపోవడంతో ప్రజలు అలాగే నివాసం ఉన్నారన్నారు. 1988లో కొన్ని ఇళ్లకు నామమాత్రంగా నష్టపరిహారాన్ని ఇచ్చినప్పటికీ గ్రామాన్ని ఖాళీ చేయించలేదని తెలిపారు. 1996లో మరో గ్రామ ముంపు వాసులకు చౌటుపల్లెను ఆనుకుని 250 పక్కా గృహాలను ప్రభుత్వమే కట్టించిందన్నారు. పాఠశాల, అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడంతో ఇక తమ గ్రామం ముంపు కిందికి వెళ్లదని భావించి చౌటుపల్లె వాసులు అక్కడే నివాసాలు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ పక్కా గృహాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారని వివరించారు. అయితే చౌటుపల్లె వాసులకు మాత్రం మొండి చేయి చూపడం అన్యాయమన్నారు. మిగతా ముంపు గ్రామాల వాసులకు 2006 కటాఫ్ కాకుండా 2016 ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె.జయశ్రీ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ ఛార్జిలను ఇష్టానుసారం పెంచుతూ వారి జేబులు నింపుతున్న ప్రభుత్వానికి ముంపువాసులకు పరిహారం ఇచ్చేందుకు చేతులు రావడం లేదని విమర్శించారు. 1977లో నామమాత్రంగా పరిహారం ఇచ్చినప్పటికీ చౌటుపల్లె వాసులు ఖాళీ చేయించలేదన్నారు. ఇప్పుడు పరిహారం అడిగే హక్కు లేదని మాట్లాడటం అన్యాయమన్నారు. మండల కేంద్రమైన కొండాపురంలో 180 ఇళ్లకు సుమారు రూ. 80 కోట్లు ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, మునకకు ఆనుకుని ఉండే మరో 180 ఇళ్లకు పరిహారం ఇచ్చేందుకు మొండికేయడం తగదన్నారు. 2006 కటాఫ్ కాకుండా 2016 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ఇళ్లను అక్వైర్ చేసి పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు నేడు ఆ విషయాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపాల్సిన ఆవశ్యకత ఉందని, అయితే ముందు రైతులకు సముచితపరిహారం అందజేసి గ్రామాలను ఖాళీ చేయించాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోమశిల ముంపువాసులకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారాన్ని ఇవ్వడంతో వారు సంతోషంగా గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిన సంగతి ఆయనకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో కొత్త ప్రాంతంలో రైతులు స్థిరపడే వరకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేయాలని కోరారు. వంశధారకింద రూ. 7 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం గండికోట ముంపు కింద మాత్రం లక్ష రూపాయలు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించరన్నారు. ముంపువాసులు చేసే పోరాటాలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని హామి ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ మాట్లాడుతూ ముంపు వాసులను ఖాళీ చేయించి మరోచోట స్థిరనివాసం కల్పించేందుకు ఎంత ఖర్చవుతుందో అంత మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న ధరలు, జీవనవ్యయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ పద్ధతిలో పరిహారం కల్పించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరారు. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత మరోచోట బ్రతికేందుకు రైతుల్లో విశ్వాసం కలిగేంత వరకు అన్ని రూపాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం మెరుగైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. ముంపువాసులు రాజకీయాలకు అతీతంగా సంఘటితపడి ఆందోళనలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముంపువాసులకు మంచి ప్యాకేజీని ఇవ్వడంతోపాటు నివాస యోగ్యమైన స్థలాలు చూపాలన్నారు. కాలనీల్లో మౌళిక వసతులను కల్పించాలన్నారు. సముచిత పరిహారం ఇచ్చేవరకు గ్రామాలను ఖాళీ చేయించరాదన్నారు. ముంపు వాసుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డీఎన్ నారాయణ, మైదుకూరు బీజేపీ నాయకుడు బీపీ ప్రతాప్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, చౌటుపల్లె, ఏటూరుకు చెందిన ముంపు వాసులు పాల్గొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు అన్యాయం: వైస్ జగన్
పోలవరంలో ప్రతిరోజూ ధర్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి అక్కడ ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 12వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో చూడాలని, కావాలంటే తాను కూడా వస్తానని ఆయన చెప్పారు. పదేళ్ల నుంచి భూసేకరణ జరుగుతున్నా ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాక గిరిజనులు కష్టపడుతున్నారని, నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టు కట్టడం న్యాయమని తెలిపారు. ఇలా అంటున్నాము కదా అని తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం అనే ముద్ర వేయొద్దని, తామెవ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నిర్వాసితులను విశ్వాసంలోకి తీసుకోవాలని, వాళ్లకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పోలవరం గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు. రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. పట్టిసీమలో ఎకరాకు 25 లక్షల చొప్పున ఇచ్చారని గుర్తు చేశారు. భూసేకరణకు అయ్యే ఖర్చు ఎప్పుడూ ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం కన్నా తక్కువే ఉంటుందని, అలాంటప్పుడు పేదప్రజలను సంతృప్తిపరుద్దామని వైఎస్ జగన్ అన్నారు. ప్యాకేజి తీసుకోనప్పుడు ఇవ్వడంలో తప్పేముందని, అప్పుడు తీసుకోలేదు కాబట్టి కొత్త చట్టాన్ని అనుసరించి తమకు పరిహారం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారని తెలిపారు. అప్పుడు డబ్బులు తీసుకుంటే ఇప్పుడు అడగడం తప్పే గానీ అలా తీసుకోలేదు కాబట్టి వాళ్లకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చేగొండపల్లి గ్రామాన్ని శుక్రవారమే ఖాళీ చేయించినట్లు మంత్రి ఉమా మహేశ్వరరావు చెప్పారు. పైడిపాక, రామయ్యపేట గ్రామస్తులకు నచ్చజెబుతున్నామని అన్నారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, ఆర్అండ్ఆర్, భూసేకరణ విషయాల్లో వాళ్లకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.