
సాక్షి, పశ్చిమగోదావరి : పోలవరానికి సంబంధించిన అన్ని పనులపై పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులకు అందే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మీద చర్చించారు. ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిగానే కొనసాగుతోందని, సవరించిన అంచనాల ప్రకారం దీని కోసం 32 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే మరిన్ని అభ్యర్థనలు బట్టి ప్యాకేజీ విషయంలో చర్చిస్తామని తెలియజేశారు. పోలవరం వరద ముంపుపై చర్చ జరుగుతోందని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస బాధితులకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.