ఏపీ సంక్షేమ పథకాలు సమర్థనీయమే | BJP Leader GVL Narasimha Rao Comments On AP Welfare Schemes | Sakshi
Sakshi News home page

ఏపీ సంక్షేమ పథకాలు సమర్థనీయమే

Published Mon, Jul 26 2021 2:58 AM | Last Updated on Mon, Jul 26 2021 2:58 AM

BJP Leader GVL Narasimha Rao Comments On AP Welfare Schemes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సమర్థనీయమేనని, ప్రజలందరికీ పథకాలు అందాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ముందు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి పసుపు–కుంకుమగా పంచినప్పటికీ టీడీపీకి ఒరిగిందేమీలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పథకాలు చేపట్టాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టి హామీలు నెరవేర్చని ఓ రాష్ట్ర ప్రభుత్వానికి (ఏపీ కాదు) ఇటీవల ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిధుల సమీకరణతో పథకాలు చేపట్టాలన్నారు. రాష్ట్రం విభజన నాటి నుంచి ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని జీవీఎల్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement