
సాక్షి, కర్నూలు : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంఘీభావం తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటగా డిమాండ్ చేసింది బీజేపీనేని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తారని కోరుతున్నామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు ప్రస్తుత సీఎం జగన్ చేయరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి పదిహేను రోజులపాటు ప్రజా సమస్యలపై, రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. జల సంరక్షణ పథకం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి మంచినీటి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జీవీఎల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment