సాక్షి, కాకినాడ : చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శల వర్షం కురిపించారు. ఎనీ టైం వాటర్ స్కీమ్ అంటూ బాబు గొప్పలు చెప్పకుంటున్నారని, కానీ ఆయన సొంత జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేటికి త్రాగునీరు అందని పరిస్ధితి నెలకొందని చెప్పారు. ‘చంద్రబాబుని అపర భగీరథుడు అని పచ్చ నేతలు అంటున్నారు. ఇది భగీరథునికి అవమానం’ అని ఎద్దేవా చేశారు. సోమవారం పోలవరం అంటూ కొత్త ప్రచారానికి తెరలేపి.. దానిని "సొమ్ము" వారంగా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. పోలవరంతో పాటు ప్రతి సాగు నీటి ప్రాజెక్టును చంద్రబాబు ఎటీఎంగా వాడుకున్నారని అన్నారు. టీడీపీ మొత్తం దొంగల పార్టీ అని రూ.1853 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌కు అదనంగా దోచిపెట్టిన రూ.321 కోట్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రైతులకు, మహిళలను ఇచ్చిన హామీలను మరిచిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు మాత్రమే న్యాయం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీఎం ఛీఫ్ మానిప్యులేటర్‌గా మారారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. ఇక ఎన్నికల వేళ జనసేన గిమ్మిక్కులపై జీవీల్ స్పందిస్తూ.. ‘ఆ పార్టీని జనసేన అనడంకంటే కులసేన అంటే బెటర్’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment