సాక్షి, విజయవాడ : ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వేల కోట్లు చేతులు మారితే.. వందల కోట్లే బయటపడుతున్నాయని.. సోదాల తీవ్రత పెంచకపోతే.. చంద్రబాబుకు ఎదురుగా కూర్చుని దీక్ష చేస్తానని బీజేపీ రాజ్యసబ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులు ఈసీ పరిధిలో జరిగేవని ఇప్పటికే పంపకాలు జరిగిపోయాయని అన్నారు. టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, డ్రామాలు అడినా ఘోర పరాభావం తప్పదని అన్నారు. అవినీతి చక్రవర్తిలా పాలన కొనసాగించారని విమర్శించారు.
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని.. ప్రతిపక్ష హోదా కూడా రాదని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఏదైనా పరిశ్రమ ఉందంటే.. అది కేవలం ఎన్నికల పరిశ్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుపుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. తనిఖీల్లో కోట్ల రూపాయల నగదు బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి వ్యతిరేకంగా తుపాన్ రాబోతోందని.. దాంట్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment