సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా.. జరగలేదని ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసేందకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ టూర్‌పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. గతంలో ఢిల్లీ పర్యటనలో రెండు కోట్ల ప్రభుత్వ సొమ్ము వృథా చేశారన్నారు. టీడీపీ అధ్యక్షుడు హోదాలో వెళ్లిన బాబు పార్టీ డబ్బు ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే.. ఆ డబ్బులను అధికారులు వసూలు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment