సాక్షి, గుంటూరు: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని.. దీని వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ నూతన చట్టాలపై సూచనలు వింటామని, కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవన్నారు. (చదవండి: విశాఖకు ఎందుకు వలసొచ్చావ్..?)
‘‘చట్టాలు రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నాం. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్ బయట అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డ్‌కు చెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు రైతుకు మిగులుతాయి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర ఉండదని కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలను నమ్మొద్దు. రైతులకు అపోహలు కలిగితే వాటిని నివృత్తి చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని’’ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరించారు. (చదవండి: సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి)
నూతన చట్టాలను స్వాగతించాలి: సోము వీర్రాజు
వ్యవసాయాన్ని ప్రవృత్తి గా మార్చుకుని ఎంతోమంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పండించే పంటలపైనే రైతుతో ఒప్పందాలు ఉంటాయని, రైతు భూమి సురక్షితమని ఈ బిల్లులో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ దిగుబడి ఖరీదు .. ఒప్పందం ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ చట్టాల గురించి రెండు దశాబ్దాలుగా చర్చ సాగుతూనే ఉంది. ఎన్నో చర్చలు, ఆలోచనలు చేశాకే ప్రధాని మోదీ.. ఈ చట్టాలను తెచ్చారు. నీరు-మీరు అంటూ కోట్లు వెచ్చించారు. కానీ నేడు ఒక్క చెట్టు కూడా కాన రావడం లేదని’ ఆయన విమర్శించారు. సేంద్రీయ వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సోము వీర్రాజు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment