సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదాను తొలగించడానికి కారణం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారణమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తెలుగువారై ఉండి ప్రత్యేక హోదాను జీవీఎల్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని, ఎంపీ మాట్లాడటం వల్లే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని రాజ్యసభలో అన్నారని మార్గాని భరత్ ప్రస్తావించారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీయింబర్స్‌మెంట్ చెయ్యాల్సి ఉంది. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ మార్గాని భరత్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment