
సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళన వెనుక కొన్ని పార్టీల కుట్ర ఉందని విమర్శించారు. రైతులకు మంచి చేయాలనే స్వామినాథన్ కమిటీ వేసి సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని తెలిపారు. (చదవండి: ఆ నిర్ణయం దేశానికే ఆదర్శం..)
మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థను కొనసాగించాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. వారి ఆర్థిక లాభం కోసమే చట్టాలను వెనక్కి తీసుకోవాలంటున్నారని విమర్శలు గుప్పించారు. తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. దేవాలయాలే దండగన్న మహానుభావుడు చంద్రబాబు అని.. ఆయన కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’)
Comments
Please login to add a commentAdd a comment