సాక్షి, న్యూఢిల్లీ : 70 ఏళ్ల పురాతన అధికరణాన్ని రద్దు చేసి పార్లమెంటులో చరిత్ర సృష్టించామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ‘ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడింట రెండు వంతుల మెజారిటీతో బిల్లు పాసయిందని తెలిపారు. రాజ్యసభలో తమకు మెజారిటీ లేకపోయినా బిల్లు పాస్ చేయించామన్నారు.
ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకశ్మీర్ తీవ్రంగా వెనుకబడిందని పేర్కొన్నారు. తాజాగా తీసుకొచ్చిన బిల్లులతో జమ్మూకశ్మీర్లో నూతన పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉంటే అసాధ్యమనేది లేదని మరోసారి రుజువైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment