సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీలో 3 ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం పార్లమెంట్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటులో ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 19 ఎలక్ట్రానిక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ క్లస్టర్లతోపాటు మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment