
సాక్షి, విజయవాడ : ఎదుటి పార్టీలపై బురదజల్లుతూ.. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, అవినీతి తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. ఏప్రిల్ 11( ఎన్నికల రోజు) తర్వాత టీడీపీ జ్యోతి ఆరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఏపీ కోసం ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేశామని, రెండు రోజుల్లో విడదల చేస్తామని చెప్పారు.