
సాక్షి, అమరావతి: నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవర్తించిన తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, ఆయన ప్రవర్తన చూస్తే ‘పిచ్చి పీక్స్’ చేరినట్టు తెలుస్తోందని జీవీఎల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహా ఫ్రస్టేషన్‌లో ఉన్న సీఎం ‘అసెంబ్లీ రౌడీ’లాగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. సీఎం తీరుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment