సాక్షి, న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమాల కేసుకు సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డు లెవల్లో స్టే ఎందుకు కొనసాగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జడ్జీలకు చంద్రబాబు సహకారం అవసరం లేదన్నారు. ( ట్యాపింగ్ శుద్ధ అబద్ధం )
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోర్టులకు ఈ విషయంలో సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ అంశం. ప్రధానికి రాసిన లేఖలో ఎవరి ఫోన్ ట్యాప్ అయిందో చంద్రబాబు రాయలేదు. అన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉండవు. కొన్ని అంశాల్లోనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. కోర్టులపై నిఘా ఉంచారని చంద్రబాబు అన్నారు. అలాంటివి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కోర్టులకు తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment