
విభజన హామీలపై అసలు జీవీఎల్‌కు అవగాహన ఉందా? అంటూ ఏపీ మంత్రి అమర్నాథ్..
సాక్షి, తాడేపల్లి: బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలటించారు. విభజన హామీలపై అసలు జీవీఎల్‌కు అవగాహన ఉందా? అని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘‘విభజన హామీలపై జీవీఎల్ చర్చకు రావాలి. స్టీల్ ప్లాంట్‌కి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయన సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటి వ్యక్తి. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వ్యక్తి జీవీఎల్ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.