డాబాగార్డెన్స్/అల్లిపురం (విశాఖ దక్షిణ): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం 2029–30 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్యసభ సభ్యుడు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందన్నారు. ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... మోదీ ప్రభుత్వం వచ్చాక ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు రూ.3.8 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఏపీకి కేంద్రం రూ.7 వేల కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. బీజేపీ నాయకులు విష్ణుకుమార్‌రాజు, లంకా దినకర్, మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ పాదయాత్రకు స్పందన లేదు
టీడీపీ నాయకుడు లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం అమరావతిలోనే ఉంటుందని, సీఎం క్యాంపు ఆఫీస్ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చన్నారు. రాజధానిగా విశాఖను ముందుగానే నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
మోదీ నాయకత్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: జీవీఎల్
Published Mon, Feb 6 2023 5:25 AM | Last Updated on Mon, Feb 6 2023 5:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment