సాక్షి, గుంటూరు: దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చిని పండిస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మిరప సాగుపై చర్చించామని పేర్కొన్నారు. ఏడాదికి 6200 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి జరుగుతోందన్నారు.ఏఏ దేశాలకు ఎగుమతి చేయాలి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై చర్చించామని జీవీఎల్ వెల్లడించారు. (చదవండి: పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం)
కేంద్రం చేసిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దారులతో రైతులను అనుసంధానం చేస్తాం. దీంతో మంచి ధర వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విపరీతంగా పురుగు మందులు వాడటాన్ని గమనించామని, అందరితో చర్చించి పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విధంగా సిఫార్స్ చేస్తామని చెప్పారు. వాటిని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. స్పైసెస్ పార్కును అందుబాటులో తెచ్చేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకొంటామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.(చదవండి: ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’)
Comments
Please login to add a commentAdd a comment