
సాక్షి, గుంటూరు : దాసరిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది రైతులు గాయపడగా, రియాజ్ అనే రైతు మరణించారు. వీరంతా హిందూపురం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడానికి బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో దాసరిపాలెం వద్ద రైతులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఒక రైతు చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుందని, ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. హిందూపురం పరిసర ప్రాంతాల రైతులు జగన్మోహన్ రెడ్డికి మెమోరండం ఇవ్వడానికి వస్తున్నారు. ఈక్రమంలోనే దాసరిపాలెం వద్ద రైతులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి ఎక్స్గ్రేషియా వచ్చే విధాoగా చూస్తానని హామీ ఇచ్చారు. గోరంట్ల మాధవ్‌తో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను పరామర్శించారు. (ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి మరో లక్ష సాయం)
Comments
Please login to add a commentAdd a comment