‘మరో 4 రోజుల్లో తొలి జాబితా’ | GVL Narsimha Rao Said Within 4 Days BJP Will Announces Candidate First List | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : జీవీఎల్‌

Published Mon, Mar 11 2019 5:42 PM | Last Updated on Mon, Mar 11 2019 8:01 PM

GVL Narsimha Rao Said Within 4 Days BJP Will Announces Candidate First List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవీఎల్‌ సోమవారం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సామాజిక ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతంతోనే జాతీయ భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు కురిపించారు. డబ్బులను పంచి అందలాలు ఎక్కాలని టీడీపీ భావిస్తుందని ఆరోపించారు. అవినీతిలో టీడీపీకి గోల్డ్‌ మెడల్‌ ఇవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీపై విర్శలు చేయడం.. తమ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమి లేదని విమర్శించారు. జనాలు గంట గంటకు తమ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement