
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఈ మధ్య హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో లంచ్ చేశారు. అమిత్ షా బిజీ షెడ్యూల్ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ భేటీపై తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. వారిద్దరి మధ్య జరిగిన భేటీలో కేవలం సినిమా అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చాయని తాను భావించడం లేదన్నారు. రాజకీయ అంశాలు కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చే ఉంటాయన్నారు. వాస్తవంగా వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వారివురిలో ఎవరో ఒకరు బయటకు చెప్తేనే తెలుస్తుందని జీవీఎల్ అన్నారు.