'ఆర్‌ఆర్‌ఆర్' టీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈనెల 23న హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నొవాటెల్ కు వెళ్తారు. అక్కడ 'ఆర్ఆర్ఆర్' టీమ్‌తో 4 గంటల నుంచి 4.30 వరకు తేనీటి విందులో పాల్గొంటారు.
ఇప్పటికే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి సహా ఆర్‌ఆర్‌ఆర్ టీంను విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించనున్నారు అమిత్ షా. కాగా గతంలో ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ టీంతో అమిత్ షా భేటీ కానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అమిత్ షా చేవెళ్ల వేదికగా జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా ఆర్‌ఆర్‌ఆర్ టీంతో భేటీ కావడం ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment