
సాక్షి, విశాఖపట్నం : రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖలో బిమ్స్‌టెక్ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో బంగాళాఖాతం సముద్ర పరిధిలో ఉన్న ఏడు దేశాలు పాల్గొని.. పోర్టులలో ఎగుమతులు, దిగుమతులు, అభివృద్ధదిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నాన్ని ఎంపిక చేశారని, ఈ ప్రాంతంల్లో పోర్టు నిర్మాణానికి అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులకు అదానీ గ్రూపు సిద్ధంగానే ఉందని, దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల పెట్టుబుడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు భూములు లేకుండా ఉన్నాయని మండిపడ్డారు.
అందుకే ఎంత పెట్టుబుడులు పెట్టబోతున్నారో పూర్తి సమగ్ర నివేదిక అడుగుతున్నామని, అందుకు తగిన విధంగా ప్రభుత్వ నుంచి భూకేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు కేటాయింపుల్లో సరిగా వ్యవహరించలేదని, అలాగే తిరుపతి వివాదాలున్న భూములను రిలయన్స్‌కు కేటాయించిందని ఆరోపించారు. ఇటీవల తాము ఇచ్చిన నోటీసులతో ఈ వ్యవహారాలన్నీ బయటపడ్డాయని, రిలయన్స్‌తోపాటు ఈ తరహా వివాదాలలో కేటాయించిన సంస్థలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపులపై పరిళీలన చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో, ఔత్సాహికులతో చర్చించి తమ ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీ ప్రకటించబోతున్నామని, ఈ బడ్జెట్ సమావేశాలకు కొత్త పాలసీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment