
సాక్షి, నెల్లూరు : తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తి మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి ప్రథమ చికిత్స చేశారు. బుధవారం వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఎంపీ ఆభ్యర్ధి గురుమూర్తి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాదవ్ శ్రీకాళహస్తి ప్రచారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఏర్పేడు వద్ద ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయి ఉండటాన్ని గమనించారు.
ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసి మనసు చలించిపోయిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లు వారికి సహాయం చేయటానికి పూనుకున్నారు. డా.గురుమూర్తి రంగంలోకి దిగి గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం అంబులెన్సులో వారిని దగ్గరలోని ఆసుపత్రికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment