సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా నవరత్నాల అమలుతో ప్రజల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకున్నారు సీఎం జగన్. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమంలో తనదైన మార్కును సొంతం చేసుకున్నారు.
జనం మెచ్చిన సీఎంగా చెరగని స్థానం సంపాదించుకున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం జగన్‌పై నెల్లూరు నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేకంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. వెండి ఆభరణాలతో సీఎం జగన్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఏకంగా 418 కేజీల వెండితో సీఎం జగన్ చిత్రాన్ని తయారు చేయించి తన అభిమానానికి హద్దులు లేవని నిరూపించారు.
కాగా.. కోయంబత్తూర్‌లోని కళ్యాణ మండపంలో వెండి ఆభరణాలతో ఆమర్చిన భారీసైజు సీఎం ప్రతి రూపాన్ని ఆవిష్కరించారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌తో ఛైర్మన్ ద్వారకానాథ్ తన ఆలోచనలను పంచుకోవడంతో.. వెండీ పట్టీలతో కళాత్మకంగా ఎంతో వ్యయప్రయాసలతో 12 గంటల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. ‘‘మహానాయుకునికి... మనఃపూర్వకంగా’’ అంటూ సీఎం జగన్‌పై తన అభిమానాన్ని చాటుకోగా, ఈ చిత్రం పలువురి ప్రసంశలను అందుకుంటోంది.
చదవండి: దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment