సాక్షి, అమరావతి : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఆరోణలపై విచారణ జరిపి..సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు.
తప్పు చేసిన వారికి కఠిన చర్యలు:నెల్లూరు ఇంచార్జి కలెక్టర్ హరే౦దిర ప్రసాద్
నెల్లూరు : జీజీహెచ్ ఘటనపై రెండు కమిటీలు విచారణ చేపడుతున్నాయి. ఒకటి డీఎంఈ తరపున ఏసీఎస్‌ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సాంబశివరావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ.. మరొకటి జిల్లా తరపున ఇండిపెండెంట్ కమిటీ. జిల్లా కమిటీలో జెడ్పీ సీఈవో , ఐసీడీఎస్ పీడీ, జాయింట్ కలెక్టర్ (ఆసరా)తో త్రిసభ్యులు ఉంటారు.
డీఎంఈ తరపు కమిటీ ఇంటర్‌నల్‌గా ఎంక్వైరీ చేస్తే.. డిస్ట్రిక్ట్ కమిటీ బయటనుంచి ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది సీరియస్ ఇష్యూ కాబట్టి డీఎంఈ కమిటీ కానీ, డిస్ట్రిక్ట్ కమిటీ కానీ దీన్ని సుమోటోగా తీసుకుంటుంది. 24 గంటల్లో డిస్ట్రిక్ట్ కమిటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment