నెల్లూరులో ప్రభుత్వ అధికారులతో సమావేశమైన మహారాష్ట్ర అధికారుల బృందం
కోవూరు/నెల్లూరు (పొగతోట): ఆంధ్రపదేశ్‌లో ఏర్పాటు చేసిన వలంటీర్లు్ల, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు విప్లవాత్మక మని మహా రాష్ట్ర అధికారుల బృందం పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా ఉందని ప్రశంసించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ఏడుగురు అధికారులు శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
ఆ బృందంలో ఉన్న పుణె డిప్యూటీ సీఈవో మిలింద్ నమేడియో టోనప్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రకాష్ భగవత్ ఖాతల్, డీఏహెచ్‌వో డాక్టర్ శివాజీ భీమాజీ విధాతే, బీడీవో సుధీర్ పాండురంగ్ భగవత్, విద్యాధికారి శేఖర్ అరవింద్ గైక్వాడ్, జేఏవో శివరామ్ డైనోబా షెడాగె, డీపీవో వికాస్ మహాడియో కుదావె కోవూరు మండలం ఇనమడుగులో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఇనమడుగు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయురాలు తాళ్ళూరు సునీత 1వ తరగతి విద్యార్థులకు నేర్పించిన ఇంగ్లిష్ స్టోరీని అదే పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బొడ్డు విజిత చెప్పడంతో ఆ చిన్నారిని అభినందించారు. అధికారులతో సమావేశమైన అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటే ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం విప్లవాత్మక మార్పు గా అభివర్ణించారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటు గా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. తరువాత నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ పనితీరును జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, ఎంపీడీవో ధనలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధి హామీ పథకం, జగనన్న శాశ్వత భూహక్కు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, పీఎం ఆదర్శ గ్రామయోజన తదితర పథకాల గురిం చి పుణె అధికారులు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు ఆర్‌డ బ్ల్యూఎస్ ఎస్‌ఈ మేడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment