మహిళను చంపి.. రోడ్డుపై పడేసి.. | Unidentified Men Assassinated Woman In Nellore | Sakshi
Sakshi News home page

మహిళను చంపి.. రోడ్డుపై పడేసి..

Published Thu, Aug 27 2020 2:31 PM | Last Updated on Thu, Aug 27 2020 3:14 PM

Unidentified Men Assassinated Woman In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ వివాహితను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కావలిలోని పుచ్చలపల్లి వారి వీధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షకీల(25) అనే వివాహిత ఏడాది క్రితం భర్తతో విడిపోయి ఇస్లాం పేటలోని తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కావలిలోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో షకీల పని చేస్తోంది. అయితే ఆమె తరచూ పుచ్చలపల్లి వారి వీధిలోని  ఓ మహిళ ఇంటి వద్దకు వస్తుండేది. ( దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు )

ఈ క్రమంలోనే  గురువారం  కూడా షకీల ఆ మహిళ ఇంటికి వచ్చింది. అక్కడ గుర్తు తెలియని కొందరు వ్యక్తులతో ఆమెకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వారు షకీలను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement