
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సంగం, సూళ్లూరుపేటలో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. ఇప్పుడు నెల్లూరు పట్టణంలోనూ ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపులు ఉంటాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment