
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో ఓ షార్ట్ ఫిల్మ్ ట్రూప్ హల్‌చల్ చేసింది. కొంతమంది యువకులు కత్తులతో బైక్‌పై చక్కర్లు కొడుతూ స్థానికులను బెంబేలెత్తించారు. షూటింగ్‌ను నిజమైన గొడవేమోనని భావించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ముత్తుకూరు గేటు వద్దకు చేరుకున్నారు. షార్ట్‌ఫిల్మ్ షూట్‌కు అనుమతి లేదంటూ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము కార్పొరేషన్ వద్ద పర్మిషన్ తీసుకున్నామని చెప్పడంతో మందలించి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment