
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ విమర్శలపై ఎదురుదాడి చేశారు. కాలువ కట్టపై నివాసాలు తొలగించే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు. సాలుచింతలో పేదల ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చిన ఘనత టీడీపీది.
టీడీపీ నేతల్లాగా పదవులు అడ్డం పెట్టుకొని నేను డబ్బులు సంపాదించలేదు. మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నా. ఇళ్లు కట్టుకోలేని బికారిని కాను. ఇప్పటికీ రూ.50 కోట్ల ఆస్తిపరుడినే. ఏ సంపాదన లేకుండా టీడీపీ నేతలు విలాసవంత జీవితం ఎలా గడుపుతున్నారు. మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే గుణపాఠం తప్పదు అని మంత్రి అనిల్ హెచ్చరించారు.
చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment