sarvepalli
-
ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపుగా రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీని వల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ‘‘నెల్లూరులో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో బయో ఇథనాల్ ప్లాంట్ రెండు దశల్లో ప్లాంట్ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ చొరవతో పరిశ్రమలు: మంత్రి కాకాణి బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ శంకుస్థాపన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం వైఎస్ జగన్ గారి చొరవతో ఇక్కడ ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగాము. ఈ పరిశ్రమకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాము. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్బంగా వారిని కోరుతున్నాను. రూ. 925 కోట్లతో నిర్మించనున్న ఈ రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ పూర్తయితే స్థానికంగా ఉండే సుమారు 75 శాతం మంది యువతకు ఉపాధి కలుగుతుంది. క్రిబ్కో విశ్వ సముద్ర ప్రవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈ రెండు ప్లాంట్స్ ను కాలుష్యం లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. -
నెల్లూరు: సర్వేపల్లి కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కాకాని
-
'మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి'
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ విమర్శలపై ఎదురుదాడి చేశారు. కాలువ కట్టపై నివాసాలు తొలగించే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు. సాలుచింతలో పేదల ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చిన ఘనత టీడీపీది. టీడీపీ నేతల్లాగా పదవులు అడ్డం పెట్టుకొని నేను డబ్బులు సంపాదించలేదు. మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నా. ఇళ్లు కట్టుకోలేని బికారిని కాను. ఇప్పటికీ రూ.50 కోట్ల ఆస్తిపరుడినే. ఏ సంపాదన లేకుండా టీడీపీ నేతలు విలాసవంత జీవితం ఎలా గడుపుతున్నారు. మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే గుణపాఠం తప్పదు అని మంత్రి అనిల్ హెచ్చరించారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్) -
టీడీపీ నేతల మాటలు నమ్మొద్దు: మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి కాలువ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువ గట్టుపై ఉన్న నిర్వాసితులతో మంత్రి అనిల్ మాట్లాడారు. ఎవరి ఇంటిని తొలగించమని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల మాటలు నమ్మొద్దని మంత్రి సూచించారు. జనవరి కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. -
నెల్లూరులో ఇసుక దుమారం: రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని సర్వేపల్లిలో టీడీపీ నేతల పర్యటనను రైతులు అడ్డుకున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపించాలని టీడీపీ నేతలను రైతులు నిలదీశారు. తమ పొలాలకు సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి మట్టిని తోలుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే, టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని రైతులు ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన రైతులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన దళిత సర్పంచ్‌పై దౌర్జన్యానికి దిగారు. కాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇసుక దుమారం రేగింది. పెన్నా ఇసుక రీచ్ నుంచి అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీ చేశారని టీడీపీ ఆరోపించడంతో పెన్నా ఇసుక రీచ్‌లో అఖిలపక్షం పర్యటించింది. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అఖిలపక్ష సమావేశ౦ ఏర్పాటు చేసి.. పేదల ఇండ్ల స్థలాల్లో తువ్వ ఇసుక నింపామని అన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షాన్ని మంత్రి కోరారు. పెన్నా నదిలో ఇసుక తీసిన గుంటలను పరిశీలించిన అఖిలపక్షం నేతలు.. జీరో వాల్యూ ఇసుక మాత్రమే జగన్నన్న కాలనీల ఫిల్లింగ్ కి తరలించారని స్పష్టం చేశారు. టీడీపీ మాత్రం అదే మొండి ఆరోపణలు వినిపిస్తోందని, ఒక దశలో టీడీపీ నేతల వైఖరి పట్ల మిగిలిన పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివాదం చేయడం కోసమే ఆరోపణలు చేయవద్దని టీడీపీ నేతలకు సూచించారు. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు -
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పథకం పైలన్ ఆవిష్కరణ
-
ప్రజాబలంతో జగన్ సీఎం అయ్యారు
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్భన్ పథకం కింద రూ. 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పూడిపర్తికి చేరుకుని నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, వాటర్‌ట్యాంక్‌లు ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు మాట్లాడారు. ప్రజాబలంతో వైఎస్ జగన్ సీఎం అయ్యారు: మంత్రి పెద్దిరెడ్డి 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన దొడ్డిదారిలో సీఎం కాలేదు. ప్రజా బలంతో తనను తాను నిరూపించుకొని, కష్టపడి సీఎం అయ్యారు. 19 నెలల్లోనే 90 శాతం మేనిఫెస్టో అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది. ముఖ్యమంత్రి మొక్కవోని దైర్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైఎస్ జగన్ ఒక సుదీర్ఘ విజన్‌తో పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే.. వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇంతపెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఏ ఎన్నికల్లో అయినా మీరు మన పార్టీలో ఎవరికి ఓటు వేసినా అది వైఎస్ జగన్‌కే ఓటేసినట్లు భావించి వేయండి' అంటూ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాట పటిమ దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటపటిమ దేశానికే ఆదర్శం. కష్టపడి, ప్రజాబలంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు దొడ్డి దారిలో, మామాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. మన ముఖ్యమంత్రికి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానం. ప్రజల కోసం నిత్యం శ్రమించే ముఖ్యమంత్రి జగన్‌ని తిరుపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి' అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం: మంత్రి అనిల్ '18 నెలలోనే మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మేనిఫెస్టోలో 90 శాతం ఇప్పటికే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది. ఇవాళ ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోంది. సచివాలయాల ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయి. తిరుపతి ఎన్నికలు ముఖ్యమంత్రి పనితీరుకి, గత ప్రభుత్వం అరాచకాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చెప్పవచ్చు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. ప్రతిపక్ష నాయకుడిగా తనకి ఇక్కడ పనిలేకనే.. బాబు పక్క రాష్ట్రంలో ఉండి పోయాడు. లోకేష్ ట్రాక్టర్ని ఉప్పుటేరులో పడేసినట్టే.. టీడీపీని కూడా సముద్రంలో ముంచడం ఖాయం. కోవిడ్ సాకు చూపి ముఖ్యమంత్రి ఏ పధకం కూడా ఆపలేదు. అన్ని పనులు చెప్పిన సమయానికి చేసి ముఖ్యమంత్రి గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: గౌతమ్‌రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళల, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒట్టి ఎంవోయూల ప్రభుత్వం, మేము ఆచరణలో పారిశ్రామిక అభివృద్ధి చూపిస్తున్నాం. 18 నెలల్లోనే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామంటే మా ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధే కారణం. వచ్చే తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాబు విజన్ 2020 అనేవాడు.. 2020లో కరోనా వచ్చింది: కాకాణి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పార్టీకి తీరనిలోటు. రేపు జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి ఎవరైనా వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో గెలిపించాలి. గతంలో చంద్రబాబు విజన్ 2020 అనేవాడు. అంటే 2020లో కరోనా వచ్చింది. మళ్లీ విజన్ 2029 అంటున్నాడు. అప్పుడేం విపత్తు వస్తుందో..?. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో పనిచేయడం ఇష్టం లేకపోతే దొంగ సంతకం పెట్టేవాడు. మంచికో సంతకం, చెడుకో సంతకం పెట్టే కుటిల నీతి చంద్రబాబు నైజం. వచ్చే తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలి. నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. నెల్లూరు జిల్లాలో ఒక బ్రూస్లీ ఉన్నాడు. ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సోమిరెడ్డికి ఈ సారి సర్వేపల్లి వైపు కన్నెత్తి చూసే దమ్ములేదు అంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. -
దోపిడీ మంత్రం
సాక్షి, తోటపల్లిగూడూరు (నెల్లూరు): అభివృద్ధి మాటున గత ఐదేళ్లుగా కోట్లాది రూపాయాలను అక్రమంగా దోచుకొని తమ ధనదాహాన్ని తీర్చుకున్నారు మండల తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చేపట్టిన పనులన్నీ నాసిరకంగా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు, పర్శంటేజీలకు తలొగ్గి మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. సీసీరోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లో భారీ దోపిడీ మండలంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు, ఉపాధి పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించి కోట్లాది రూపాయలు జేబుల్లోకి నింపుకున్నారు. పంచాయతీరాజ్ కింద గడిచిన ఐదేళ్లలో రూ.18.04 కోట్లను హెచ్చించి సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్, శ్మశానవాటికలు తదితర 320 పనులను చేపట్టారు. పంచాయతీ నిధులకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరిగాయి. నాణ్యతకు తిలోదకాలిస్తూ చేపట్టిన నిర్మాణాల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు గడించారు. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన చెత్త సంపద క్షేత్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లోనూ అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి. జన్మభూమి కమిటీల అనుగృహం ఉంటేనే.. గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణ పథకం కింద మండలంలో 1,160 పక్కా గృహాలు, 3,436 రేషన్ కార్డులు, 1,071 పింఛన్లు, 734 మందికి ప్రభుత్వ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే 54 మందికి చంద్రన్న పెళ్లి కానుక, 233 మందికి చంద్రన్న బీమా చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫార్సు ఉండాల్సిందే. స్థానికంగా మంత్రి సోమిరెడ్డి అండతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయింది. ఆత్మగౌరవం తాకట్టు అరుంధతీయకాలనీలో నాసిరకంగా నిర్మించిన మరుగుదొడ్డి మండలంలోని 22 పంచాయతీల్లో గత ఐదేళ్లలో 5,905 మరుగుదొడ్లను నిర్మించగా అందులో 4,850 మరుగుదొడ్లకే అభికారులు బిల్లులు చేశారు. అయితే నాచరల్ లీడర్ల పేరుతో తెలుగు తమ్ముళ్లే గ్రామాల్లో ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో నిర్మాణాలను నాసిరంగా చేపట్టి రూ.లక్షలు అక్రమంగా దోచుకున్నారు. ముఖ్యంగా తోటపల్లిగూడూరు, తోటపల్లి, ఈదూరు, కోడూరు, కొత్తపాళెం, వెంకన్నపాళెం గ్రామాల్లో దోపిడీ పర్వం అధికంగా సాగినట్లు విమర్శలున్నాయి. ఇలా నాసిరంగా నిర్మించిన నెల రోజులకే మరుగుదొడ్ల ట్యాంకులు కూలిపోవడం, తలుపులు, కిటీకీలు పగిలిపోవడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, వీధిదీపాలు, డ్రెయినేజీ వంటి వాటిని టీడీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు. దీంతో స్థానికులు ఐదేళ్లుగా అనేక ఇబ్బందుల నడుమ జీవనం సాగించాల్సి వచ్చింది. మండలంలోని పలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్థలాల కొరతపై ఐదేళ్లలో దాదాపు 1,200 మంది అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలను అందించినా ఎక్కడా అంకణం స్థలం చూపించిన దాఖలాలు లేవు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనానికి ఐదేళ్లలో మోక్షం కలగలేదు. పొట్లపూడి–కొత్తపాళెం ప్రధాన రహదారి గుంతలమయమై గత పదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు–చెట్టు పనుల్లో చేతివాటం కోడూరు బీచ్ సమీపంలో బకింగ్‌హాం కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి రెండు నెలలకే గోతులు ఏర్పడిన దృశ్యం (ఫైల్) ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీరు–చెట్టు పనుల్లోనూ తెలుగు తమ్ముళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మండలంలో ఐదేళ్లలో నీరు–చెట్టు కింద రూ.11.47 కోట్లతో మొత్తం 178 పనులు జరిగాయి. వాస్తవంగా రైతులకు ఉపయోగపడే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. అయితే జరిగిన పనుల్లో అధిక శాతం అవసరం లేని అధికార పార్టీ నేతలు సూచించిన పనులే జరిగాయి. కొన్ని చోట్ల అధికారులను అడ్డం పెట్టుకుని చేయని పనులకు కూడా తమ్ముళ్లు బిల్లులు చేసుకొని లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులను దోచుకున్నారనే విమర్శలున్నాయి. అంతే కాకుండా కోడూరు, మాచర్లవారిపాళెం, వరిగొండ కెనాల్స్, వాటి కింద నడిచే చిన్న పారుదల కాలువల్లో జరిగిన పూడికతీత పనుల్లో తెలుగు తమ్ముళ్లు కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బకింగ్ హాల్ కెనాల్‌పై వంతెన నిర్మాణం నాసిరకంగా ఉండడంతో రెండు నెలలకే గోతులు ఏర్పడ్డాయి. రైతుల ఇష్టాఇష్టాలతో పని లేకుండా లోపభూయిష్టంగా చేపట్టిన నీరు–చెట్టు పనుల వల్ల అధికార పార్టీ నాయకుల బాగుపడ్డారే తప్ప తమకేమి ఒరిగింది లేదని రైతులు అధికార పార్టీ నాయకుల తీరుపై బహిరంగంగానే మండిపడుతున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనమేంటి ? ప్రభుత్వ పథకాల పంపిణీలో జన్మభూమి కమిటీ సభ్యులు పెత్తనం ఎక్కువై పేదలకు అన్యాయం జరిగింది. వీరి వల్ల ప్రజల చేత ఎన్నికైన తమలాంటి ప్రజా ప్రతినిధులకు విలువలేకుండా పోయింది. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. – ఆకుల మధు, మాజీ సర్పంచ్, నరుకూరు అవినీతే తప్ప అభివృద్ధి లేదు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతే తప్ప అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ అభివృద్ధి జరగలేదు. నీరు–చెట్టు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దొచుకున్నారు. – మన్నెం చిరంజీవుల గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు -
ఒక్క బల్బుకు రూ.8.73 లక్షల బిల్లు
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈ బిల్లు చూపించి అధికారుల్ని అడిగితే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో వినియోగదారుడికి దిక్కుతోచడంలేదు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు తొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర పక్కాగృహం నిర్మించుకుంటున్నాడు. మూడు నెలల కిందట ఆ ఇంటికి కొత్త మీటర్ బిగించుకుని, ఒక బల్బు వినియోగిస్తున్నాడు. దీనికి జనవరిలో రూ.85, ఫిబ్రవరిలో రూ.87 బిల్లులొచ్చాయి. ఫిబ్రవరిలో వాడకానికి సంబంధించి ఈనెలలో ఇచ్చిన బిల్లు మాత్రం లక్షలైంది. 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలు వేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. ఈ బిల్లు చూసి కంగుతిన్న బాధితుడు స్థానిక ట్రాన్స్‌కో అధికారులతో తన గోడును వెళ్లబోసుకుంటే తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు గొల్లుమంటున్నాడు. -
అద్వితీయ రాష్ట్రపతికి రాజమహేంద్రవరానుబంధం
చరిత్ర కెక్కని వాస్తవం రెండేళ్లు ఆర్ట్స్ కాలేజీలో తత్త్వశాస్త్రాన్ని బోధించిన సర్వేపల్లి రాజమహేంద్రవరం కల్చరల్: తత్త్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ ద్వితీయ రాష్ట్రపరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునికి రాజమహేంద్రవరంతో అనుబంధం ఉంది. అయితే ఆ విషయం చరిత్రపుటలకు ఎక్కలేదు. ఆయన 1917–1919 మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్సు కళాశాలలో ‘ఫిలాసఫీ’ (తత్త్వశాస్త్రాన్ని) బోధించారు. ఆ రోజుల్లో ఆర్ట్సు కళాశాల నేటి గూడ్సుషెడ్డుకు సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఉండేది. రాధాకృష్ణన్ పండితుడు నేటి టి.నగరు ప్రాంతంలోని కొక్కొండవారి వీధిలో నెలకు రూ.15 అద్దెకు ఉండేవారు. అయితే ఆ విషయం సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంపై వెలువడిన గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. చివరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నిఘంటు నిర్మాణశాఖ, భాషాభివృద్ధిపీఠం ఆధ్వర్యంలో ప్రచురించిన ‘20వ శతాబ్దపు తెలుగువెలుగులు’ గ్రంథంలో ప్రచురించిన రాధాకృష్ణన్‌పై వ్యాసంలో కూడా ఈ విషయాన్నిఎక్కడా ప్రస్తావించలేదు. అయితే రాజమహేంద్రి జ్ఞాపకాలు ఆయనలో సదా పదిలంగా ఉండేవి. ఆ విషయం చరిత్ర పరిశోధకుడు, గ్రంథరచయిత యాతగిరి శ్రీరామనరసింహారావు తన స్వీయచరిత్ర‘నరసింహావలోకనం’లో ఇలా తెలియజేశారు. ‘1962లో గుర్గాంవ్లో అఖిల భారత సహకారశిక్షణా కళాశాలలో శిక్షణపొందుతున్న సమయంలో నా నాయకత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరం ట్రెయినీలం రాష్ట్రపతి సర్వేపల్లిని కలుసుకునేటందుకు విజ్ఞాపన పత్రాన్ని పంపాం. వెంటనే రాష్ట్రపతి భవనం నుంచి ప్రత్యేక దూత ద్వారా మాకు అంగీకారం లభించింది. అది1962 సెప్టెంబర్ 30 వ తేదీ సాయంత్రం 4 గంటలు. సర్వేపల్లికి నాపేరు వైఎస్ నరసింహారావు అని తెలిపాను. ఊరు పేరు, ఇంటిపేరుతో సహాపూర్తిగా చెప్పమని ఆయన అడిగారు. ఊరు రాజమండ్రి, పూర్తిపేరు యాతగిరి శ్రీరామనరసింహారావు అన్నాను. మాది బ్రాహ్మణులలో మధ్వశాఖ అని వెంటనే గ్రహించిన ఆయన అరిపిరాల పాపారావు పంతులుగారు బాగున్నారా? అని అడిగారు. అరిపిరాలవారి ఇంట దక్షిణంవైపు వాటాలో నెలకు రూ. 15 అద్దెపై ఉండేవాడినని ఆయన తెలిపారు. ఆయనింకో ప్రశ్న వేశారు.. రాజమండ్రి మెయిన్‌రోడ్డు అంతే ఉందా? తరువాత ఆయన వేసిన మరోప్రశ్న– గోదావరిబ్రిడ్జి కింద ఏడో స్తంభం బలహీనమైనదని అనేవారు, ఇంకా అంటున్నారా? అని. నా చిన్నతనంలో అనేవారని బదులు చెప్పాను. మాకు కేటాయించిన 8 నిమిషాల సమయం 26 నిమిషాల వరకు కొనసాగింది’. స్మృతి చిహ్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజమహేంద్రవరంలో పనిచేసిన సుమారు 96 సంవత్సరాల తరువాత, నేటి ఆర్ట్సుకళాశాల ప్రాంగణంలో –2015లో ఆయన శిలా విగ్రహాన్ని నెలకొల్పారు. దానిపై ఈ వివరాలన్నీ పేర్కొనడం నగర ప్రేమికులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి. -
పంట చేతికందేవరకు పర్యవేక్షిస్తా
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం: రైతులకు పంట చేతికందేవరకు సాగునీటి కొరత లేకుండా పర్యవేక్షిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సర్వేపల్లి కాలువను అనికేపల్లి ర్యాంపు వద్ద ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం సర్వేపల్లి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడారు. సాగునీటికి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ప్రధాన కారణం అధికారులకు ముందుచూపు లేకపోవడమేనన్నారు. సంగం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంచెలంచెలుగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటి మట్టాన్ని పెంచి మోటార్లు కింద, చెరువు కాలువల ఆయకట్టుకు నీరు అందించేందుకు అధికారులతో చర్చిం చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏడు గంటలకు మరో మూడు గంటలు పెంచి 10 గంటలు రైతులకు విద్యుత్ అందించే లా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ కింద 40 వేల ఎకరాలు సాగవుతుందన్నారు. సాగునీరు అందే విషయంలో కాలువల ఆధునికీకరణ పనులు కొన్ని మిగిలిపోయి ఉన్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రిజర్వాయర్ కింద పదేళ్లుగా రైతులు రెండో పంటకు నోచుకోలేదన్నారు. నిలిచిపోయిన పనులను కాంట్రాక్టర్లతో వెంటనే చేయించాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వాయర్‌కు అధిక శాతం నిధులు మంజూరు చేయించారని తెలిపారు. కనుపూరు కాలువకు నీటిమట్టం పెంచడం వలన రెండు రోజుల్లో నీటి కొరత తీరనుందని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వేపల్లి రైతాంగానికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ సభ్యుడు కోసూరు పద్మగౌడ్, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కనుపూరు కోదండరామిరెడ్డి, పద్మనాభనాయుడు, ఆరుకుంట ప్రభాకర్‌రెడ్డి, కోడూరు ప్రదీప్‌రెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, పోచారెడ్డి సుమంత్‌రెడ్డి, కోసూరు సుబ్బయ్య గౌడ్, సురేష్, శ్రీధర్, కుంకాల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడమగట్టు కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి పొదలకూరు: కండలేరు ఎడమగట్టు కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం) మంజూరైనట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం ప్రభుత్వం రూ.61 కోట్లను మంజూరు చేస్తూ జీఓను జారీ చేసినట్టు వెల్లడించారు. ఎంతోకాలంగా మెట్టప్రాంత రైతాంగం ఎదురుచూస్తున్న కల సాకారం అయినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్న కాలం నుంచి ఎడమగట్టు కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. అప్పట్లో ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానన్నారు. రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడే ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని ఆయన స్వాగతించారు. మెట్టరైతులకు తీపికబురు కండలేరు ఎడమగట్టు కాలువ జలాశయం నుంచి సక్రమంగా నీరు అందక ప్రతి ఏటా ఇబ్బందులు పడే పొదలకూరు మండల మెట్ట రైతాంగానికి ఎత్తిపోతల పథకం మంజూరు కావడం తీపి కబురులాంటిది. చాలీచాలని సాగునీటితో వంతులవారీగా రైతాం గం కాలువ గుండా సాగునీటిని పారించుకునే వారు. ఎత్తిపోతల పథకం పూర్తిఅయితే జలాశయంలోని నీటిని ఎల్లవేళలా పారించుకునేందుకు వీలుకలుగుతుంది. ఎత్తిపోతల పథకం కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సుదీర్ఘకాలం పోరాటమే చేశారు. రైతుల పక్షాన నిలబడి ఆయన కాలువకు ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను ఆయా ప్రభుత్వాలకు వివరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి పథకానికి నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీచేసింది. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
వెంకటాచలం, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు కాకుటూరుకు చెందిన డబ్బుగుంట వెంకటేశ్వర్లుయాదవ్తో పాటు ఆయన అనుచరులు, యర్రగుంటకు చెందిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, మోహన్, పెంచలయ్య, శీనయ్య, లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, ఏడుకొండలుతో పాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులోని గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్ర నిర్మాణం, వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన జగన్మోహన్రెడ్డి మాత్రమే చేయగలరన్నారు. అధికార దాహంతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిని అమలు చేయడం సాధ్యమేనే అని ఆయనను ఆనే ప్రశ్నించుకోవాలని హితవుపలికారు. అప్పట్లో వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు కరెంట్ బిల్లులు చెల్లించని వారిపైనా కేసులు పెట్టించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీకటి మయం చేసి ప్రజలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు అధికారం కోసం అభివృద్ధి చేస్తానని అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం అధిష్టించిన చంద్రబాబు, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణమద్యపాన నిషేధం పథకాలకు తూట్లు పొడిచారన్నారు. రేషన్ బియ్యం ధరను రూ.5.25కి పెంచడంతో పాటు ఊరూరా మద్యం బెల్టుషాపులను తెరిపించిన ఆయన ఘనతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలుపై చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తుది శ్వాసవిడిచేంత వరకూ దానిని అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు, ఆయన మరణం తర్వాత అధికారం చేపట్టిన వారు తూట్లు పొడిచారన్నారు. వైఎస్సార్ ఆశయసాధన జగన్‌తోనే సాధ్యమన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకటాచలం జెడ్పీటీసీ అభ్యర్థి మందల వెంకటశేషయ్య, పి.ఖయ్యూమ్‌ఖాన్, కుడితిపూడి మురళీధర్ నాయుడు తదితరులు పాల్గోన్నారు. -
ప్రజాసంక్షేమం జగన్‌కే సాధ్యం
వెంకటాచలం, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరులో పూల కోటేశ్వరరావు, గుర్రం మల్లికార్జున్, తురకా పెంచలయ్య, బెల్లం సురేంద్ర, వీరేపల్లి మహేష్, బాలా రమేష్, దేవళ్ల రత్నంతో పాటుగా తమ వర్గీయులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. సీమాంధ్రులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించి తెలంగాణ విభజ నకు కారణమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత విభజనకు మద్దతు తెలిపి అనంతరం రాజీనామాతో సరిపెట్టుకున్నారన్నారు. సోనియా తన కుమారుడిని ప్రధానిని చేయాలని స్వార్థపు రాజకీయాలతో తెలంగాణ విభజన జరిగిందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ విభన బిల్లుకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాటాలు చేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కు ఓట్లు వేసి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నాయకులు వడ్లమూడి సురేంద్రనాయుడు, పి.హుస్సేన్, ఈశ్వరనాయుడు, పూల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
డిష్యుం..డిష్యుం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశంలో మాటల యుద్ధం ముగిసి తన్నుల యుద్ధం మొదలైంది. పాతకాపులు, వలస నేతల మధ్య దాడులు షురూ అయ్యాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు సోమవారం బాహాబాహీ తలపడ్డాయి. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. టీడీపీలో తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా ఉన్న సందర్భంలో చిన్నపాటి సంఘటన పెద్ద తగువుకు తెరలేపింది. ఇదే అదనుగా కొత్త, పాత తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇందుకు ఇందుకూరుపేట వేదికైంది. వివరాలలోకి వెళితే.. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ వేసింది. ఇదే స్థానానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు సతీమణి మునగాల సుజాత కూడా నామినేషన్ వేసింది. అయితే సోమిరెడ్డి వర్గానికి చెందిన మునగాల సుజాతకే బీఫాం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్ర ఈ విషయాన్ని ఆదిశేషారెడ్డి వర్గీయులకు చె ప్పాడు. దీంతో ఆగ్రహం చెం దిన ఆదాల వర్గీయుడు ఆదిశేషారెడ్డి తాము పోటీ నుంచి ఉపసంహరిం చుకుంటామంటూ అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు వచ్చారు. అప్పటికే టీడీపీ మండల అధ్యక్షుడు వీరేంద్రతోపాటు సోమిరెడ్డి వర్గీయుడు రంగారావు సైతం అనుచరులతో కలసి ఎన్నికల అధికారి వద్దకు చేరుకున్నారు. ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు. దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఓ టీడీపీ సీనియర్ నేత ‘సాక్షి’తో వాపోయారు. గొడవలు ఇంతటితో ఆగవన్నారు. వలస నేతలతో పార్టీ నిలువునా మునగడం ఖాయమన్నారు.