Canal works
-
తమ్మిలేరు ప్రాజెక్టుకు మహర్దశ
-
'మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి'
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ విమర్శలపై ఎదురుదాడి చేశారు. కాలువ కట్టపై నివాసాలు తొలగించే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నేతల అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు. సాలుచింతలో పేదల ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చిన ఘనత టీడీపీది. టీడీపీ నేతల్లాగా పదవులు అడ్డం పెట్టుకొని నేను డబ్బులు సంపాదించలేదు. మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నా. ఇళ్లు కట్టుకోలేని బికారిని కాను. ఇప్పటికీ రూ.50 కోట్ల ఆస్తిపరుడినే. ఏ సంపాదన లేకుండా టీడీపీ నేతలు విలాసవంత జీవితం ఎలా గడుపుతున్నారు. మీ బతుకులేందో ఆలోచించి మాపై విమర్శలు చేయండి. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే గుణపాఠం తప్పదు అని మంత్రి అనిల్ హెచ్చరించారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్) -
‘జూన్ నాటికి సాగు నీరందించాలి’
సాక్షి, కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఆదివారం ఆమె భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో జరుగుతున్న ప్రాజెక్టు కెనాల్, పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, కాం ట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2020 నాటికి సాగునీరు అందించేలా పనులు చేయాలన్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా చేస్తున్న పంప్‌హౌస్, కెనాల్ పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలోగా పంప్‌హౌస్ డ్రైరన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనకట్ట నుంచి బీజీకొత్తూరు వరకు కెనాల్ పనులు, పంప్‌హౌస్, వంతెనలు జన వరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ 2 నెలలు యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. -
నత్తే నయం!
వ్యవసాయ రంగంలో కీలకమైన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్ల అలసత్వం రైతాంగానికి శాపంలా మారింది. ప్రభుత్వాలు రూ.కోట్లు మంజూరు చేసినా ఆయా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయలేక చేతులెత్తేస్తున్నారు. టెండర్లలో దక్కించుకున్న పనులను పర్సంటేజీ కోసం సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి పనులు పూర్తికాక పంటలకు నీరు సక్రమంగా అందడం లేదు. దీంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఇందుకు తార్కాణం ప్యాకేజీ–4లో జరుగుతున్న కనుపూరు కెనాల్ లైనింగ్ పనులే. లైనింగ్ పనులు ప్రారంభించి దశాబ్దం ముగిసినా కూడా సగభాగం కూడా పూర్తి కాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలోని 66 వేల ఎకరాలకు సాగునీరందించే కనుపూరు కెనాల్ లైనింగ్ వర్క్స్ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ప్యాకేజీ–4 కింద రూ.71.94 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులను ఏకేఆర్ కోస్టల్ కంపెనీ పేరుతో టెండర్ ద్వారా చేజిక్కించుకుని 2008 మార్చి మూడోతేదీన అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండేళ్లలో ఆయా పనులు పూర్తి చేసేలా అగ్రిమెంట్లో చూపించారు. ఆ నిధులతో జిల్లాలోని సంగం నుంచి బండేపల్లి వరకు సుమారు 55 కిలో మీటర్లు కనుపూరు కెనాల్ లైనింగ్ వర్క్స్, 44 స్ట్రెక్చర్స్ రిపేర్లు చేయాల్సి ఉంది. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ పర్శింటేజీలు తీసుకుని సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించారు. 55 కిలోమీటర్ల వరకు కెనాల్ లైనింగ్ పనులను భాగాలుగా విభజించి సబ్ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. కానీ పదకొండేళ్లు పూర్తయినా కూడా లైనింగ్ పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. ఇప్పటివరకు 51.94 శాతం పనులే పూర్తి చేశారు. మిగిలిన 48.6 శాతం పనులు పూర్తికాలేదు. టెండర్ అగ్రిమెంట్లో మాత్రం రెండేళ్లకాల వ్యవధిలో పూర్తిచేస్తానని చూపించినా దశాబ్దకాలం దాటినా కూడా పనులు పూర్తి చేయకపోవడం వెనుక కాంట్రాక్టర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో మాత్రం సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటూ కల్లిబొల్లి మాటలతో నెట్టుకొచ్చారే తప్పా ప్యాకేజీ –4 పనులపై గత పాలకులు దృష్టిసారించలేకపోయారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీలు తీసుకుంటూ పనులు చేయని వారికి వత్తాసు పలుకడంతో ప్యాకే జీ–4 పనుల్లో అడుగుమందుకు పడలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. గతేడాది నుంచి నిలిపివేసిన పనులు గత టీడీపీ హయాంలో ఆ పార్టీకీలక నేతలతో సత్సబంధాలు నెరిపిన కాంట్రాక్టర్ ప్యాకేజీ–4 పనులు నత్తనడకన సాగిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్న దాఖాలాలు కన్పించలేదు. గతేడాది నుంచి కెనాల్ లైనింగ్ పనులు పూర్తి స్థాయిలో నిలపివేశారు. పూర్తయిన పనులకు దాదాపు రూ.4 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సాకు చూపి సదరు కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసినట్లు అధికారులు చెపుతున్నారు. ప్రతిఏటా ఆ వర్క్స్ అగ్రిమెంట్ పెంచుకుపోతున్నా కూడా కాంట్రాక్టర్ సహకరించడం లేదని అధికారులు తెలిపారు. పనులు పూర్తిచేయాలని రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కాంట్రాక్టర్ నుంచి స్పందన లేదని తెలుస్తోంది. సాగునీరు అందక.. జిల్లాలో దాదాపు 66 వేల ఎకరాలకు సాగునీరు అందించే కనుపూరు కెనాల్ లైనింగ్ పనులు నిలిచిపోవడంతో ఆ ఆయకట్టు రైతులకు సాగునీరు సక్రమంగా అందడంలేదని ఆ ప్రాంత రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ లైనింగ్, స్టేక్చర్స్ రిపేర్లు జరిగి ఉంటే సాగునీరు సకాలంలో అందే అవకాశం ఉంది. ఆయా పనులు జరగకపోవడంతో కెనాల్లో సాగునీరు సక్రమంగా పారుదల లేక చివరి ఆయకట్టు వరకు అందక ఎండిపోతుందని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చాం కనుపూరు కెనాల్ లైనింగ్ పనులు చేసే కాంట్రాక్టర్‌కు ఇప్పటికే రెండు సార్లు నోటీసులిచ్చాం. పనులు నత్తనడకన సాగుతున్న విషయం వాస్తమమే. ఆ కాంట్రాక్టర్‌కు నోటీçసులు ఇచ్చినా స్పందన లేదు. గతేడాది నుంచి ఆ పనులను పూర్తిగా నిలిపివేశారు. ఆ పనులు నిలిచిపోవడంతో సాగునీరు సరఫరాకు ఇబ్బందిగా ఉంది.– కృష్ణమెహన్, నెల్లూరు సెంట్రల్ఇరిగేషన్ ఈఈ -
కేశవా.. ఈ పాపం నీది కాదా!
కరువు సీమపై టీడీపీ పగబట్టింది. పారే నీటిని ఒడిసిపట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాలువల్లో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఆ పార్టీ నేతలకు భారీగా ముడుపులు ముట్టజెప్పడంతో.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడంలో భాగంగా పనులు నాసిరకంగా చేయడం మొదటికే మోసాన్ని తీసుకొచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, రిత్విక్.. ఇతరత్రా టీడీపీ దత్తత కాంట్రాక్టర్లు జిల్లాలో చేపట్టిన ఏ పని కూడా సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. తుంగభద్ర, హంద్రీనీవాల నుంచి భారీగా నీరు వస్తున్నా.. కాలువల పనుల్లో నాణ్యత లోపించి ఎక్కడికక్కడ గండ్లు పడి నీరు వృథా అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు పయ్యావుల కేశవ్ తమ పార్టీ బినామీ కాంట్రాక్టు సంస్థలతో హడావుడిగా చేయించిన పనుల్లో నాణ్యత లోపానికి ఈ చిత్రమే నిదర్శనం. హంద్రీనీవా 34వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన డిస్ట్రిబ్యూటరీ కాలువకు శనివారం కురిసిన ఒక్క వర్షానికే మూడు చోట్ల గండి పడింది. ఈ నీరంతా పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నీళ్లిస్తున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చిన ‘పయ్యావుల’ పాపమే ఇప్పుడు గండ్ల రూపంలో రైతులకు శాపంగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలన్న దురాశ.. అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు అడ్డంగా దోచిపెట్టాలన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరాశ.. వెరసి రైతులకు కష్టాల పాలు చేసింది. ఏమాత్రం నాణ్యత లేని పనులతో కాలువలు తెగి వర్షపునీరు పొలాల్లో ప్రవహించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యే నిర్వాకం తమ జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని వాపోతున్నారు. ఉరవకొండ: కరువు సీమ కడగండ్లు తీర్చే హంద్రీ– నీవా సుజల స్రవంతి పథకం పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీగా అక్రమాలకు పాల్పడింది. హంద్రీ–నీవా పనుల్లో అంచనాలు పెంచి రూ.కోట్లు దోచుకున్న టీడీపీ నేతలు కనీసం పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదు. వివరాల్లోకెళితే.. హంద్రీ– నీవా 34వ ప్యాకేజీలో భాగంగా 12,500 ఎకరాల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. పనులను బెంగళూరుకు చెందిన రెడ్డి వీరన్న కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టారు. ఇందులో భాగంగా ఉరవకొండ మండలం వ్యాసాపురం వద్ద నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ నుంచి 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ డిస్ట్రిబ్యూటరీ పనులు సంబంధిత కాంట్రాక్టర్ పూర్తి నాసిరకంగా చేపట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పయ్యావుల కేశవ్ హుటాహుటిన డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు తీసుకొచ్చారు. కాలువ వద్ద ఫొటోలకు ఫోజులు ఇచ్చి రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నించారు. నాసిరకం పనులతోనే కాలువకు గండ్లు డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు పూర్తి నాసిరకంగా ఉండటంతో శనివారం కురిసిన భారీ వర్షానికి వద్ద మూడు చోట్ల కాలువకు గండి పడటంతో భారీగా నీరు పొలాలను ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మూడు చోట్ల గండి పడింది. దీంతో నీరు పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తింది. వ్యాసాపురం గ్రామానికి చెందిన కొంకరామప్ప, అశోక్, సీతారాములు, ఉలిగప్ప తదితర పొలాల్లోకి వరద నీరు భారీ చేరి పొలాలు నిండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండిపడిన విషయాన్ని హంద్రీ–నీవా అధికారులకు రైతులు సమాచారం అందించారు. -
కొండపోచమ్మ సాగర్ పనుల్లో అపశృతి
గజ్వేల్‌రూరల్ : కొండపోచమ్మ సాగర్ కాల్వ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. కాల్వ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కార్మికులపై కాంక్రీటు–సిమెంట్ మిక్చర్ మిల్లర్ లారీ జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న కొండపోచమ్మ సాగర్ ప్రధాన కాల్వ నిర్మాణ పనుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం కాల్వలో సిమెంటు–కాంక్రీటు వేసేందుకు తీసుకొచ్చిన మిక్చర్ మిల్లర్ లారీ కాల్వపై భాగం నుంచి అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో కింది భాగంలో ఉన్న కార్మికులు దానికింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా గ్రామస్తులు, పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ (45), మహేశ్ (23)గా గుర్తించారు. -
ఆగస్టులో ట్రయల్ రన్
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. మండల పరిధిలోని వీకే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్‌హౌస్, కెనాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వీకే రామవరంలో జరుగుతున్న పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలాపురంలో పనులు నత్తనడకన జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు చేయాలి కాని.. కుంటిసాకులు చెప్తూ జాప్యం చేయడమేమిటని ఏజెన్సీలను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పనులు జరగకపోవడానిక కారణాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం జరిగిన రోజులకు సంబంధించి సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సైట్ మేనేజింగ్, ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయం ఏమాత్రం లేదన్నారు. దశల వారీగా రోజుకు ఎంత పని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారుచేసుకుని దాని ప్రకారం పనులు చేస్తే త్వరగా పూర్తవుతాయన్నారు. రోజువారీ ఎంత కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకుని, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను అందచేస్తామని, ఆ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంప్‌హౌస్‌ల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా సీఎం కార్యాలయం నుంచి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకుని పనులను ప్రతీ రోజూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్ట్ మొదటి, రెండో దశలకు 6 మోటార్లు, మూడో దశకు 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు గ్రావిటీ కెనాల్ 1,2,3,4,7,8 పనులు అక్టోబర్ మాసం చివరి నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ పనుల్లో వేగం పెంచాలని, రానున్న వర్షాకాలం నాటికి సివిల్ పనులు పూర్తి చేయకపోతే వర్షాల వలన ఇబ్బందులు వస్తాయన్నారు. బీజీ కొత్తూరుకు వస్తుండగా కాలువ పనులు జరగడంలేదని గుర్తించానని, ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయడంలేదన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ, సీఎంఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, ములకలపల్లి తహశీల్దార్ ముజాహిద్, ప్రతిమ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ–1లో భాగంగా మండల పరిధిలోని బీజీకొత్తూరులో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్‌హౌస్ పనులను ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీతో కలిసి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ శుక్రవారం సందర్శించారు. పంప్‌హౌస్ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, పనుల్లో పురోగతిని, గోదావరి జలాలు పంప్‌హౌస్ వరకు ఎప్పటి వరకు తరలిస్తారనే వివరాలు తెలుసుకున్నారు. బీజీకొత్తూరు పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, కెనాల్‌పై వంతెనల నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, జనవరి 23న పనులను సందర్శించిన సమయంలో మార్చిలో మోటర్లు డ్రై రన్ నిర్వహించి మే నెల కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదని, పనులపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని స్మితా సబర్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ, అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మొదటి పంహౌస్ , కెనాల్ పనులు వేగవంతం చేయాలన్నారు. మోటర్లు, పంపులు అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ కల్లా పాలేరు జలాలకు సీతారామ జలాలు అనుసంధానం చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో అలసత్వం వహించినా, పనులు గడువు లోపు పూర్తి చేయకున్నా ఊరుకునేది లేదని తగిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థను, ప్రాజెక్ట్ అధికారులను హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతీ రోజు జరిగిన పనులపై తనకు పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈ టీ.నాగేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం శ్రీనివాసరావు, ఏఈలు రమేష్, శ్రీనివాస్, స్వాతి, రాజీవ్‌గాం«ధీ, దుర్గాప్రసాద్, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేష్, తహసీల్దార్ అరుణ, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
కాల్వ పనులు చేపట్టాలని రైతుల ధర్నా
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన హెచ్చెల్సీ కాల్వ లైనింగ్ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కేంద్రంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గార్లదిన్నె మండలంలోని సాగు భూములకు నీరందించే దక్షిణ కాల్వ పరిధిలోని 5వ డిస్ట్రిబ్యూటరీకి బైపాస్ పనులు చేపట్టక పోవటంతో 8 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలవరం కాలువ వెడల్పు
సగానికి కుదింపు హడావుడి తవ్వకాలు.. నిబంధనలకు తిలోదకాలు కాలువ తవ్వాల్సిన వెడల్పు 80 మీటర్లు తవ్వుతున్నది 40 మీటర్లు వంతెనల స్థానంలో తూముల ఏర్పాటు పరిహారం చెల్లింపులోనూ వివక్ష హనుమాన్ జంక్షన్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద నిర్వహిస్తున్న పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. భూసేకరణలో ప్రకటించిన నష్ట పరిహారం చెల్లింపులో హెచ్చుతగ్గుల నుంచి కాలువ వెడల్పు తగ్గించటం వరకు అన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువ నిర్మాణంలో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వటం ఆయా గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాలన్నీ పోలవరం కాలువ పనులను తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా చేపట్టింది తప్ప రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కాదని తేటతెల్లం చేస్తున్నాయి. పరిహారం చెల్లింపులో పక్షపాతం పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించేందుకు పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను వేగవంతం చేశారు. జిల్లాలో సుమారు 1222 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకాలను పూర్తి చేసేందుకు నూజివీడు, బాపులపాడు, ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లో 1346 మంది రైతుల నుండి సుమారు 1222.16 ఎకరాల భూమిని సేకరించారు. సేకరించిన భూమికి నష్టపరిహారం ప్రకటించటంలో గ్రామానికో విధంగా భారీ వ్యత్యాసం చూపటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఉన్న గ్రామాలకు అధికంగా నష్టపరిహారం ప్రకటించి, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములకు తక్కువ పరిహారం ప్రకటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాపులపాడు మండలం వేలేరులో ఎకరాకు రూ.52.90 లక్షలు, రేమల్లెకు రూ.44.90 లక్షల నష్టపరిహారం చెల్లించగా, అదే మండలంలోని మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న బండారుగూడెంలో భూములు కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలకు రూ.30.50 లక్షల పరిహారం ప్రకటించటమే దీనికి నిదర్శనం. కాలువకు లైనింగ్ లేదు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కుడి కాలువను 80 మీటర్ల వెడల్పుతో తవ్వి అడుగు భాగంలో బెడ్ కాంక్రీట్, ఇరువైపులా సిమెంట్ లైనింగ్‌తో పటిష్టంగా నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో కాలువ వెడల్పు కుదించటంతో పాటు లైనింగ్, బెడ్ కాంక్రీట్‌ను సైతం విడిచిపెట్టేశారు. ప్రధాన రహదారులను కాలువ దాటేచోట గతంలో వంతెనల నిర్మాణం చేపట్టగా, ప్రస్తుతం తూములు ఏర్పాటు చేయటం పనుల్లో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది. డీఈ వివరణ పట్టీసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తరలించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం మేరకు ప్రస్తుతం 40 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వుతున్నామని పోలవరం కుడి ప్రధాన కాలువ డీఈ పద్మిని తెలిపారు. ఆ తర్వాత కాలువను పూర్తిస్థాయి వెడల్పునకు విస్తరించి, లైనింగ్, బెడ్ కాంక్రీట్, వంతెనల నిర్మాణాలు చేపడతామని ఆమె వివరించారు. నిబంధనలకు తిలోదకాలు పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలిచ్చింది. కాలువ వెడల్పు సగానికి కుదించి తవ్వకాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కుడి కాలువ వెడల్పు 80 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం కేవలం 40 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వటం గమనార్హం. ఇప్పటికే పూర్తయిన 80 మీటర్ల వెడల్పు కాలువ నుంచి 40 మీటర్ల వెడల్పు కాలువలోకి నీరు ప్రవహించటంలో ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని పర్యవసానంగా 80 మీటర్ల వెడల్పు ఉన్న కాలువ నీటి మట్టం పెరిగి గట్టు తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పనులు చూస్తే..లో లెవల్
హాలియా/తిప్పర్తి : జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించిన ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ (వరద కాల్వ)..నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాల్వ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడం..కొన్నిచోట్ల పూడిపోయి..కంపచెట్లు అల్లుకోవడం..బలహీనంగా కరకట్టల నిర్మాణం.. ఇలా అనేక కారణాలతో కాల్వకు నీటిని విడుదల చేసినప్పుడు సాఫీగా వెళ్లక ఒత్తిడితో గండ్లు పడుతున్నాయి. అష్టాకష్టాలకోర్చి వేసిన పంటలు నీటమునుగుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 1997లో వరద కాల్వ పనులను చేపట్టారు. కానీ కాల్వ నిర్మాణ పనులు నత్తకు నడకనేర్పిన చందంగా సాగుతుండటంతో నేటికీ పూర్తి కాలేదు. నాగార్జునసాగర్ జలాశయంలో 575 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్న సమయంలో గ్రావిటీ ద్వారా, మిగిలిన సమయంలో మోటార్ల ద్వారా కాల్వలోకి నీటిని పంప్‌చేస్తారు. రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన కాల్వ నిర్మాణ పనులను ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడి హయాంలో ఏడేళ్లలో రూ.30 కోట్లను ఖర్చు చేసి 27 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. ఆ తరువాత అధికారంలోకి వ చ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పెరిగిన ధరల ప్రకారం వరద కాల్వ, పంప్‌హౌస్ నిర్మాణ వ్యయాన్ని రూ.212కోట్లగా నిర్ణయించి ఈపీసీ విధాన ంలో తిరిగి టెండర్లు పిలిచారు. ఇందులో పంపుహౌస్ నిర్మాణం కోసం 108 కోట్లు, కాల్వల నిర్మాణానికి రూ.104 కోట్లు కేటాయించారు. ఈ పనులను 2009లోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం కావడం.. భూసేకరణకు రైతులు ససేమిరా అనడంతో కాల్వ నిర్మాణం ఆసల్యమైంది. అసంపూర్తి కాల్వలు.. పెద్దవూర మండలం పుల్యానాయక్‌తండా నుంచి వేములపల్లి మండలం మొల్కపట్నం వరకు 85.30 కిలోమీటర్ల తీయాల్సి ఉంది. అలాగే మొత్తం 42 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు తీయాల్సి ఉండగా కేవలం 29 డిస్ట్రిబ్యూటరీలను మాత్రమే తీసి వదిలేశారు. ఇక పిల్ల కాల్వల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో కేవలం 66 కిలోమీటర్లు వరకే నీరు వస్తోంది. తిప్పర్తి మండలం మాడ్గులపల్లి సమీపంలో రైల్వేలైన్ వద్ద 70.947 కిలోమీటర్ల వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం... ఇదే గ్రామ శివారులో 72.820 కిలోమీటర్ వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై బ్రిడ్జి నిర్మాణం..అదే విధంగా 72.55 కిలోమీటర్ నుంచి73.6 కిలోమీటర్ వరకు మొత్తం 1 కిలోమీటరు పొడవు కాల్వ పని ఇంచుకూడ మొదలు కాలేదు. రైతులు కోర్టును ఆశ్రయించడంతో పనులు మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు 65వ కిలోమీటరు నుంచి 85వ కిలోమీటరు వరకు 13 డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదు. ఇక..పంప్‌హౌస్ నిర్మాణంలో జాప్యం కారణంగా సాగర్ జలాశయంలో నీరున్నప్పటికి వరదకాల్వ కింద రైతులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఏటా వేలాది టీఎంసీల నీరు వృథాగా దిగువ కృష్ణానదిలో కలిసిపోతున్నప్పటికీ పాలకులు కాల్వ నిర్మాణం పూర్తి చేయకపోవడం శోచనీయం. -
కాంట్రాక్టర్లకు వరంగా కాలువ పనులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీటి బొట్టును ఒడిసి పట్టాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.. పాలకులు పదేపదే చెబుతున్న మాటలివి.. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పెద్ద వర్షం వస్తే ఆ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి. చెరువులకు, కాలువలకు గండ్లు పడి నీటి పారుదల వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. తరచి చూస్తే కాంట్రాక్టర్ల కాసుల దాహం.. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం ఇందులో కనిపిస్తోంది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే కాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో కాలువలకు నీరు వదిలే సమయంలోనే కాంట్రాక్టర్లు పనులు చేపడుతుంటారు. అధికారులు కూడా ఆ సమయంలోనే నిధులు మంజూరు చేస్తుంటారు. దీంతో పనులు నాసిరకంగా సాగి అవి‘నీటి’లో కొట్టుకుపోతున్నాయి. కాలువ పనుల్లో ప్రవహిస్తున్న అక్రమాలపై ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు నిలదీశారు. అలాగే కాలువల దుస్థితిని కూడా సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. ప్రభుత్వమూ స్పందించలేదు. ఫలితంగా బనగానపల్లె పరిధిలోని ఎస్సార్బీసీకి మంగళవారం భారీ గండి పడి వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ఈ ఘటన మరువక ముందే బుధవారం చాగలమర్రి సమీపంలో కేసీ కెనాల్ 231/100 కి.మీ వద్ద ఓ చోట, 231/200 కి.మీ వద్ద మరో చోట గండి పడింది. రెండు చోట్ల గండ్లు పడటంతో సుమారు 300 క్యూసెక్కులకుపైగా నీరు వృథాగా పోతున్నాయి. ఇటీవల కాలంలో 0.5 కి.మీ వద్ద కేసీ కాలువకు గండిపడిన విషయం విదితమే. ప్రధాన కాలువలకు తరచూ గండ్లు పడటానికి పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయ‘కట్’.. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, ఎల్లెల్సీలను నిర్మించారు. ఎల్లెల్సీ మినహా మిగిలిన రెండు కాలువల ద్వారా వచ్చే నీటి ఆధారంగా 3.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. అయితే కొంత కాలంగా కాలువలకు విడుదలచేసే నీరు చివరి ఆయకట్టుకు అందటం లేదు. నాసిరకం నిర్మాణాలతో కట్టకున్న రాళ్లు, మట్టి కాలువల్లో చేరుతోంది. కర్నూలు- కడప కాలువను రూ.1,170 కోట్లతో ఆధునికీకరించారు. కర్నూలు నుంచి వైఎస్సార్ కడప జిల్లా వరకు 0 నుంచి 325 కి.మీ వరకు ఈ కాలువ విస్తరించింది. గండ్లు పడతాయనే ఉద్దేశంతో 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. 2,500 క్యూసెక్కులకే పరిమితం చేశారు. దీంతో కేసీ కెనాల్ కింద ఏటా ఆయకట్టు తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.