కాల్వ పనులు చేపట్టాలని రైతుల ధర్నా | farmers dharna in ananthpur distirict | Sakshi
Sakshi News home page

కాల్వ పనులు చేపట్టాలని రైతుల ధర్నా

Published Tue, Aug 18 2015 12:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

farmers dharna in ananthpur distirict

అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన  హెచ్చెల్సీ కాల్వ లైనింగ్ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కేంద్రంలో రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గార్లదిన్నె మండలంలోని సాగు భూములకు నీరందించే దక్షిణ కాల్వ పరిధిలోని 5వ డిస్ట్రిబ్యూటరీకి బైపాస్ పనులు చేపట్టక పోవటంతో 8 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement